అనుమతులకు మించి గ్రావెల్ తవ్వకాలు
ABN , Publish Date - Mar 15 , 2026 | 12:38 AM
మండలంలో గ్రావెల్‌ను యథేచ్ఛగా తవ్వుతున్నారు. కనసానపల్లిలో సర్వే నెం.1606, 1608 లలో మైనింగ్ అధికారుల నుంచి విఐ ఎంటర్ ప్రైజెస్ సంస్థ వారు లీజు పొందారు.
ఆగిరిపల్లి, మార్చి 14(ఆంధ్రజ్యోతి):మండలంలో గ్రావెల్‌ను యథేచ్ఛగా తవ్వుతున్నారు. కనసానపల్లిలో సర్వే నెం.1606, 1608 లలో మైనింగ్ అధికారుల నుంచి విఐ ఎంటర్ ప్రైజెస్ సంస్థ వారు లీజు పొందారు. లీజుకు విరుద్ధంగా లీజుదారుడు అధిక లోతు తవ్వారని కొందరు స్థానికులు మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మైనింగ్ అధికారులు ఈనెల 12న కొలతలు నిర్వహించి అనుమతులకు మించి తవ్వకాలు జరిపారని తేల్చారు. లీజుదారుడుకు నోటీసులు జారీ చేశామని, అతను ఇచ్చిన సమాధానం మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని మైనింగ్ అధికారులు తెలిపారు.