అక్రమ బ్లాస్టింగ్‌పై మంత్రి ఆరా
ABN , Publish Date - Jun 26 , 2026 | 01:02 AM
ఆగిరి పల్లి మండలం నరసింగపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ వ్యవహారంపై గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టి సారించారు.
ఆగిరిపల్లి తహసీల్దార్, పోలీసులు తనిఖీలు
బ్లాస్టింగ్ మెటీరియల్ స్వాధీనం
నూజివీడు, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ఆగిరి పల్లి మండలం నరసింగపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ బ్లాస్టింగ్ వ్యవహారంపై గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దృష్టి సారించారు. గురువారం ఈ అక్రమ బ్లాస్టింగ్ గురించి వార్తపత్రికలలో వార్తలు రావడంతో మంత్రి సంబంధిత అధికారులను ఏఏ పర్మి షన్లు ఉన్నాయి, దానికి సంబంధించిన రికార్డు లను తీసుకుని గురువారం మధ్యాహ్నం సెక్రటే రియట్‌కు రమ్మని ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. కాగా అక్రమ బ్లాస్టింగ్ వ్యవహారం బయటకి పొక్కడంతో గురువారం మధ్యాహ్నం ఆగిరిపల్లి తహసీల్దార్ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు క్వారీని తనిఖీ చేశారు. బ్లాస్టింగ్‌కు ఉప యోగించే వైర్లను స్వాధీనం చేసుకు న్నారు. జిలెటిన్ స్టిక్‌లు ఎక్కడ అని అధికారులు క్వారీ సిబ్బందిని ప్రశ్నించారు. వారు సరైన రీతిలో సమా ధానం చెప్పక పోవడంతో బ్లాస్టింగ్‌కు సంబంధించిన అనుమతి పత్రాలు రేపటిలోగా చూపిం చకపోతే క్వారీ నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.