ఇరిగేషన్ ఎస్‌ఈ దేవప్రకాశ్ సరెండర్
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:11 AM
జలవనరుల శాఖ ఎస్‌ఈ సీహెచ్ దేవ ప్రకాశ్ సేవలు తమకు అవసరం లేదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆ శాఖ ఉన్నతాధికారు లకు సరెండర్ చేస్తూ లేఖ రాశారు.
తమకవసరం లేదంటూ ఆ శాఖకు కలెక్టర్ వెట్రిసెల్వి లేఖ
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జలవనరుల శాఖ ఎస్‌ఈ సీహెచ్ దేవ ప్రకాశ్ సేవలు తమకు అవసరం లేదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆ శాఖ ఉన్నతాధికారు లకు సరెండర్ చేస్తూ లేఖ రాశారు. సంబంధి త శాఖ వివరాలతో తనకు అందుబాటులో ఉండడం లేదని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఆయన ఈఈ పోస్టుకే పరిమితం కానున్నారు. కీలకమైన జలధార– జలహారతి కార్యక్రమంలో ఎస్‌ఈ పోస్టులో ఎవరిని నియమించకపోవడం విమర్శలకు తావిచ్చింది. పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఆయనను తాజాగా సరెండర్ చేశారు. ఏడాది క్రితం రెగ్యులర్ ఎస్‌ఈ పి.నాగార్జునరావు ఉద్యోగ విరమణ చేశారు. ఈ స్థానంలో తాడేపల్లిగూడెం ఆర్‌ఎంసీ ఈఈ దేవప్రకాశ్‌ను ఇన్‌చార్జి ఎస్‌ఈగా నియమిస్తూ ఉన్నతా ధికారులు ఆదేశాలిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో నీరు–చెట్టు కింద చేపట్టిన బిల్లుల కోసం పలువురు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించడంతో ఆ కేసుల విచారణలు జరిగినప్పుడల్లా ఎస్‌ఈ కోర్టుకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను సరెండర్ చేయడం జలవనరుల శాఖలో చర్చకు దారితీసింది.