అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:28 AM
మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్‌కుమార్ హెచ్చ రించారు.
ఐజీ అశోక్‌కుమార్
కలిదిండి, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఐజీ అశోక్‌కుమార్ హెచ్చ రించారు. కలిదిండి పోలీస్‌స్టేషన్‌ను గురువారంఎస్పీ కేపీఎస్. కిశోర్‌తో కలిసి రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహిళల పై నేరాలకు పాల్పడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్, విక్రయిస్తే ఉక్కుపాదం మోపుతామన్నారు. రాత్రివేళల్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. దొంగతనాలు అరికట్టేందుకు సీసీ.కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసుగస్తీ నిర్వహిస్తామన్నారు. తొలుత ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్‌తో కలిసి ఇటీవల చినతాడినాడలో రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రును కొల్పోయిన చిన్నారులు శరణ్యనాగశ్రీ, నితీశ్‌లకు చెరో రూ.25వేలు చొప్పున రూ.50వేలును పోస్టాఫీసులో డిపాజిట్ చేసిన పత్రాలను అందించారు. కానిస్టేబుళ్లకు హెల్మెట్‌లు పంపిణీ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్, సీఐ రవికుమార్, ఎస్సై వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.