హెచ్‌పీవీ టీకా పంపిణీ
ABN , Publish Date - Feb 26 , 2026 | 01:08 AM
క్యాన్సర్‌ను అరికట్టడానికి హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్)వ్యాక్సినేషన్ కార్యక్రమా నికి వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.
బహిరంగ మార్కెట్‌లో ఒక్కో డోసు ధర రూ.3,927
ఆధార్ కార్డులోని పుట్టిన తేదీనే ప్రామాణికం
అన్ని పీహెచ్‌సీలు, అర్బన్ పీహెచ్‌సీల్లో సర్వే ప్రారంభం
ఏలూరుఅర్బన్, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ను అరికట్టడానికి హెచ్‌పీవీ(హ్యూమన్ పాపిల్లోమా వైరస్)వ్యాక్సినేషన్ కార్యక్రమా నికి వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 28న ప్రాథమిక ఆరోగ్య కేంద్రా(పీహెచ్‌సీ/అర్బన్ పీహెచ్‌సీ) ల్లో హెచ్‌పీవీ టీకా పంపిణీని ప్రారంభించ డానికి ముందస్తుగా బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా సర్వేను చేపట్టింది. మహిళల్లో వేగంగా విస్తరిస్తున్న గర్భా శయ ముఖ ద్వార(సర్వైకల్)క్యాన్సర్‌ను అరికట్టేందుకు గార్డాసిల్–4 వ్యాక్సిన్ సిం గిల్ డోసును బాలికలకు ఇవ్వనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 200 లకుపైబడి క్యాన్సర్లుండగా, వీటిలో 4 రకాల క్యాన్సర్లు(6, 11, 16, 10) మాత్రమే భారత దేశంలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనికి అనుగుణం గానే నాలుగు రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు గార్డాసిల్–4 రకం హెచ్‌పీవీ టీకా మందును ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్ క్యాన్సర్ కణాలను నివారిస్తుందని, తద్వారా క్యాన్సర్ బారినపడకుండా రక్షించవచ్చని వైద్య వర్గాలు వివరించాయి.
14 ఏళ్ల బాలికలకే..
ప్రభుత్వం ఉచితంగా అందించే హెచ్‌పీవీ వ్యాక్సిన్ పంపిణీకి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. 14 ఏళ్ల బాలికలకు మాత్రమే తొలిదశలో టీకా పంపిణీ చేస్తారు. అంటే 15వ ఏడు వస్తే ఇవ్వరు. ఇందులో భా గంగా జిల్లాలో నిర్ధేశిత మార్గదర్శకాలకు లోబడి ఎంతమంది బాలికలు ఉన్నారో గుర్తించేందుకు బుధవారం నుంచి అన్ని పీహెచ్‌సీలు, అర్బన్ పీహెచ్ సీల్లో ఏఎన్‌ఎంలతో సర్వేను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇమ్యు నైజేషన్ విభాగం ప్రారంభించింది.ఈ సర్వేను రెండురోజుల్లోగా పూర్తిచేసి నివేదికను ప్రభుత్వానికి పంపితే, ఆ మేరకు అవసరమైనన్ని డోసుల హెచ్‌పీపీ వ్యాక్సిన్ నిల్వలను జిల్లాకు ప్రభుత్వం అందిస్తుంది.బాలికల వయస్సును నిర్ధారించుకునేందుకు ఆధార్ కార్డుపై ముద్రించిన పుట్టిన తేదీని ప్రామా ణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.జిల్లాలో 62 పీహెచ్‌సీలు, 18అర్బన్ పీహెచ్‌సీలుండగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ఇప్పటికే మెడికల్ ఆఫీసర్లకు శిక్షణను పూర్తిచేయగా,వీరంతా సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని స్టాఫ్‌నర్సులు, ఫార్మసిస్టులు, ఏఎన్ ఎంలకు శిక్షణ నిచ్చారు. కాగా గతేడాది సెప్టెంబరు 17నుంచి ఎన్‌సీడీ 4.0లో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ చేపట్టిన ఇంటింటా క్యాన్సర్ పరీక్షల సర్వేలో భాగంగా 16 లక్షల మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వ హించాలనే లక్ష్యంలో ఇప్పటివరకు 43శాతం మందికి స్ర్కీనింగ్ టెస్టులను పూర్తి చేశారు. టెస్టుల్లో జిల్లాలో వందల సంఖ్యలోనే క్యాన్సర్ లక్షణాలున్న మహిళలు వెలుగులోకిరాగా, రోగనిర్ధారణ తుది పరీక్షల్లో 20 మందికి క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. ఈ టెస్టులు, సర్వేలతో నిమిత్తం లేకుండా ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా నిర్ధేశిత వయసున్న బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ను ఉద్దేశించారు. బహిరంగ మార్కెట్‌లో గార్డాసిల్–4 (క్వాడ్రివాలెంట్ హెచ్‌పీవీ వ్యాక్సిన్)ఒక డోసు ధర రూ.3927 ఉండగా, కేంద్రప్రభుత్వం ఈ టీకామందును దేశ వ్యాప్తంగా బాలికలందరికీ ఉచితంగా అందజేయాలని నిర్ణయించింది.