Share News

ఇళ్లు ఖాళీ చేస్తున్నారు..!

ABN , Publish Date - Jun 14 , 2026 | 12:57 AM

వేలేరుపాడులో ఈనెల ఒకటో తేదీ అర్ధరాత్రి రెండిళ్లు కాలిపోయి ఆ మంటల్లో చిక్కుకుని ఇద్దరు మహిళలు సజీవ దహనమైన ఘటన సంచలనం రేపిన విషయం విదితమే.

ఇళ్లు ఖాళీ చేస్తున్నారు..!
ఇంటికి తాళాలు వేసి వేరేప్రాంతానికి వెళ్లిపోవడంతో ఖాళీగా ఉన్న గృహం

ఇద్దరు మహిళల సజీవ దహనం ఘటనతో భయకంపితులవుతున్న వేలేరుపాడు గ్రామస్థులు

వేలేరుపాడు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): వేలేరుపాడులో ఈనెల ఒకటో తేదీ అర్ధరాత్రి రెండిళ్లు కాలిపోయి ఆ మంటల్లో చిక్కుకుని ఇద్దరు మహిళలు సజీవ దహనమైన ఘటన సంచలనం రేపిన విషయం విదితమే. పోలీ సులు ఈ కేసును అనుమానిత కేసుగా నమోదు చేయడంతో ఇది ఎవరో కావాలనే చేసిన పనేనని భావిస్తున్న గ్రామస్థులు నిత్యం భయంతో జీవిస్తున్నారు. ఎప్పుడు ఏమవుతుం దోనని ఇల్లు కాలిన వీధిలో నివాసం ఉంటున్న పలు కుటుంబాల వారు ఒక్కొక్కరుగా ఇళ్లు ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ వీధిలో కేవలం ఎనిమిది ఇళ్లు ఉండగా అందులో రెండు కాలిపోగా మిగిలిన ఆరు ఇళ్ల లోని ఐదు కుటుంబాలు ఇంటికి తాళాలు వేసు కుని వేరేచోటుకు తరలిపోవడంతో చీకటిపడితే ఆ వీధిలోంచి వెళ్లేందుకే ఆ గ్రామస్థులు భయ పడుతున్నారు. పక్కవీధిలోని గ్రామస్థులు కూడా రాత్రివేళల్లో భయంగానే గడుపుతున్నా రు. మరోవైపు రోజులు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి కనిపించడం లేదు. సాధ్యమైనంత త్వరగా ఈ మిస్టరీ మరణాలను పోలీసులు ఛేదించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jun 14 , 2026 | 12:57 AM