పేదల స్థలాలు.. చిత్ర విచిత్రాలు..!
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:43 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన పేదల ఇళ్ల స్థలాల విషయంలో ఇప్పటికే పలుచోట్ల అనేక అవకతవకలు వెలుగుచూ శాయి.
పట్టా ఒకరిది.. ఎంజాయ్‌మెంట్ పత్రం మరొకరిది.. ఇది ఇచ్చిన అధికారులెవరో తెలియని వైనం
పెదవేగి, ఆగస్టు 28(ఆంధ్రజ్యోతి):గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన పేదల ఇళ్ల స్థలాల విషయంలో ఇప్పటికే పలుచోట్ల అనేక అవకతవకలు వెలుగుచూ శాయి. పెదవేగి మండలంలో కొందరి స్థలాల విషయంలో గందరగోళం నెలకొంది. పట్టాలు కొందరి పేరున ఉండగా ఎంజాయ్‌మెంట్ పత్రాలు వేరొకరి పేరున మంజూరు కావడం గమనార్హం. గత వైసీపీ హయాంలో గార్లమ డుగు పంచాయతీ వెంకటకృష్ణాపురంలో రెండె కరాల భూమిని రైతు నుంచి కొనుగోలు చేసి జగనన్న లే అవుట్ వేశారు. 77 మంది లబ్ధిదారు లను ఎంపిక చేసి, ఒక్కొక్కరికి 72 గజాల స్థలం ఇచ్చారు. కొంత మంది ఇళ్లను నిర్మించుకోగా మరికొందరు ఆర్థికపరమైన ఇబ్బందులతో నిర్మించుకోలేదు. కాగా తమకు పట్టాలు ఇచ్చిన స్థలంలో కొందరు లబ్ధిదారులు ఇటీవల ఇంటి నిర్మాణం చేప ట్టారు. వారికి లీగల్ నోటీసులు రావడంతో ఖంగుతిన్నారు. ఆ స్థలం తమదం టూ నివేశన స్థలం ధ్రువీకరణ (ఎంజాయ్ మెంట్) పత్రాలను చూపిస్తూ, కోర్టు నుంచి తాకీదులు పంపించారు. తమకు పట్టా ఉండగా వేరొకరికి ఎంజాయ్‌మెంట్ ఎలా ఉంటుందం టూ లబ్ధిదారులు ఆశ్చర్యపోయారు. ఎంజాయ్ మెంట్ సర్టిఫికెట్లు 2021 ఏప్రిల్ 19న జారీ చేసినట్టు వుంది. ఇలా మూడు సర్టిఫికెట్లు ఉండగా వాటిపై వీఆర్వో, తహసీల్దారు సంతకాలు వేర్వేరుగా ఉండడం గమనా ర్హం. రాజముద్ర(స్టాంప్) కూడా ప్రత్యేకంగా ఉంది. ఆ సంతకా లు తమవి కావని అధికారులు చెబుతున్నారు. ఆ ఎంజాయ్ మెంట్‌లను చూపుతూ కోర్టుకు వెళ్లడంతో పట్టాదారులు ఇబ్బందులు పడుతున్నారు. నేదూరి ప్రభావతి జగనన్న కాలనీ లో 67 నంబర్ ప్లాట్‌ను కేటాయించి పట్టా ఇచ్చారు. కొద్దినెలల కిందట ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టగా కోర్టు నుంచి వచ్చిన తాకీదుతో ఇంటి నిర్మాణం పూర్తి చేయాలా, వద్దా.. అన్న సందిగ్ధంలో పడ్డారు. 67వ ప్లాట్ తనదంటూ అదే గ్రామానికి చెందిన తలాడి వాణి ఎంజాయ్‌మెంట్ పత్రం చూపుతున్నారు. పఠాన్ బాజీ అనే మహిళకు 72వ ప్లాట్ కేటాయించగా పఠాన్ దౌలత్‌బీ అనే మహిళ, 77వ నంబర్ ప్లాట్ అంగలకుదురు వరహలక్ష్మీనరసమ్మకు కేటాయించగా పొనుకుమాటి భాగ్యం అనే మహిళ ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్లతో రావడంతో పట్టాలు ఉన్న లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. పట్టాలు మా పేరున ఉంటే ఎంజాయ్‌మెంట్‌లు వారికి ఎలా వచ్చాయంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మరో గమ్మత్తైన విషయమేమంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండేళ్లకు ఆ భూమిని రైతు నుంచి కొనుగోలు చేసి పట్టాలు ఇచ్చారు. అయితే ఎంజాయ్‌మెంట్ పత్రాల్లో 12 ఏళ్లకు పైబడి ఆ స్థలం సంబంధిత మహిళల స్వాధీనంలో ఉందని ధ్రువీకరించడం గమనార్హం. దీని వెనుక కొందరి వైసీపీ నాయకులు ఉన్నట్టు ఆరోపణలు విన్పిస్తున్నాయి.