Share News

మునుగుతున్న సొంతింటి కల

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:06 AM

అదిగో స్థలం.. ఇదిగో గృహం’ అంటూ గత ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు శాపంగా మారాయి. పల్లపు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగలేదు.

మునుగుతున్న సొంతింటి కల
యనమదుర్రులో జగనన్న ఇళ్లకు కేటాయించిన స్థలంలో వరిచేలు

పల్లపు ప్రాంతాల్లో పట్టాలు..

ఐదేళ్లుగా ముందుకు సాగని ఇళ్ల నిర్మాణాలు

భీమవరం, నరసాపురం, తణుకుల్లో ముంపులోనే స్థలాలు

బిల్లులు రాక పనులు వదిలేసిన కాంట్రాక్టర్లు.. తీవ్ర నిరాశలో లబ్ధిదారులు

‘అదిగో స్థలం.. ఇదిగో గృహం’ అంటూ గత ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు శాపంగా మారాయి. పల్లపు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించి ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగలేదు. ఎంచుకున్న స్థలాలు లోతట్టు ప్రాంతాలు కావడం, వాటిని పూడ్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో నిర్మాణాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేవలం పేరు కోసమే స్థలాలు ఇచ్చారన్న విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. సరైన దారులు కూడా లేని ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వడంపై లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

(భీమవరం రూరల్‌–ఆంధ్రజ్యోతి):

ప్రధానంగా భీమవరంలో 84 ఎకరాలు, నరసాపురంలో 80 ఎకరాలు, తణుకులో 25 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా కేటాయిం చారు. ఇవన్నీ భారీ లోతట్టు ప్రాంతాలు కావడంతో వర్షాకాలం లో పూర్తిగా నీట మునుగుతున్నాయి. భీమవరంలోని 60 ఎక రాల విస్తీర్ణంలో ఒక్క ఇల్లు నిర్మాణ దశకు చేరుకోలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తణుకులోనూ గృహ నిర్మాణా లు పూర్తిగా నిలిచిపోయాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి ఆ పల్లపు ప్రాంతాలను ఎవరు పూడుస్తారని లబ్ధిదారులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి ముందుకొచ్చిన కాం ట్రాక్టర్లు సైతం నిధుల లేమితో పనులు నిలిపివేశారు. నర సాపురంలో మూడు వేల ఇళ్ల నిర్మాణానికి ఒప్పందం చేసుకు న్న ఓ కాంట్రాక్టరు.. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో పునాదుల దశలోనే పనులను వదిలేసి వెళ్లిపోయారు. తాడేప ల్లిగూడెంలో మూడు వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టిన కాంట్రా క్టర్లు సైతం బిల్లులు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు.

గత ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణాల కోసం కొందరు ప్రజా ప్రతినిధులు కొత్త పద్ధతులకు తెరతీశారు. డ్వాక్రా సం ఘాల ద్వారా మహిళలకు లక్ష రూపాయల చొప్పున రుణాలు ఇప్పించి, ఆ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు ఇచ్చి ఇళ్లు నిర్మించేలా ఒప్పందాలు చేశారు. మరికొన్ని చోట్ల లబ్ధిదారులే స్వయంగా లక్ష రూపాయలు కాంట్రాక్టర్‌కు చెల్లించేలా, ప్రభు త్వం నుంచి నిర్మాణ సామగ్రి అందించేలా నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ఈ ప్రయోగాలు సైతం బెడిసికొట్టడంతో పునాదుల వరకే పరిమితమైన ఇళ్లు.. ఇప్పుడు నిరుపయోగంగా మారా యి. ఏళ్లు గడుస్తున్నా సొంతింటి కల నెరవేరకపోవడంతో లబ్ధిదారుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంది.

పల్లపు ప్రాంతంలో ఇల్లు ఎలా కట్టేది?

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సెంటున్నర స్థలాన్ని ఇచ్చారు. అది పల్లంగా ఉండ టంతో పూడిక చేసుకుని ఇల్లు కట్టుకునే స్థోమత లేక అలానే వదిలేశా. వర్షం వస్తే ఆ భూమి మునిగిపోతుంది. మరో నాలుగడుగుల ఎత్తు పూడ్చుకోవాలి.

– కె. రామలింగేశ్వరరావు, బేతపూడి

Updated Date - Oct 06 , 2026 | 12:06 AM