నకిలీ ఽధ్రువపత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:32 AM
తల్లి పేరుమీద ఉన్న ఇంటిని సొంత కుమారుడే నకిలీ ధృవపత్రాలతో తల్లికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన పెదవేగి మండలం వంగూరు శివారు లక్ష్మీ పురంలో జరిగింది.
నకిలీ ఽధ్రువపత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్
పెదవేగి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): తల్లి పేరుమీద ఉన్న ఇంటిని సొంత కుమారుడే నకిలీ ధృవపత్రాలతో తల్లికి తెలియకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన పెదవేగి మండలం వంగూరు శివారు లక్ష్మీ పురంలో జరిగింది. పెదవేగి ఎస్‌ఐ ఎం.హరిగోపాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మీపురం గ్రామానికి చెందిన మిరియాల గంగరాజు, దుర్గ దంపతుల కుమారుడు దినేష్ వారిని నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు.గ్రామపెద్దలు పలుమార్లు హెచ్చరించినా అతడిలో మార్పు రాలేదు. ఇదిలా ఉండగా తాజాగా దినేష్.. తన తల్లి పేరుమీద ఉన్న ఇంటిని నకిలీ ధృవీకరణ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం ఇది నా ఇల్లు అంటూ తల్లిదండ్రులను ఇంట్లోకి రాకుండా వేధిస్తున్నాడు. దీనికి అతని స్నేహితులు మరో ఐదుగురు సహకరిం చారు. దీనిపై దుర్గ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ హరిగోపాల్ తెలిపారు.