Share News

సడెన్‌గా ఎంట్రీ.. షాకైన సిబ్బంది

ABN , Publish Date - May 09 , 2026 | 12:23 AM

తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సడెన్‌గా ఎంట్రీ.. షాకైన సిబ్బంది
వైద్య సిబ్బందితో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే రాధాకృష్ణ అర్ధరాత్రి తనిఖీలు

తణుకు, మే8 (ఆంధ్రజ్యోతి): తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. బైక్‌పై సామాన్య వ్యక్తిలా రావడంతో ఆసుపత్రి సిబ్బంది షాక య్యారు..ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రోగులు ఎదుర్కొం టున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో రెండో వార్డుకు చెందిన గర్భిణి అనూషకు హైబీపీ ఉండడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి వెళ్లేందుకు అంబు లెన్సు ఏర్పాటు చేశారు. అనూషకు మెరుగైన వైద్యం అందిం చాలని ఏలూరులోని వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. గర్భిణులను ఇతర ప్రాంతాలకు రిఫర్‌ చేసే సమయంలో అక్కడి వైద్యులతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని వైద్యులకు సూచించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆర్‌ఎంవో డాక్టర్‌ సాయి బాలాజీ, నర్సింగ్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - May 09 , 2026 | 12:23 AM