Share News

ఉద్యాన వికాసానికి 19 ఏళ్లు

ABN , Publish Date - Jun 26 , 2026 | 12:46 AM

వెంకట్రామన్నగూడెం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యా న విశ్వవిద్యాలయం ఏర్పాటై నేటికి 19 ఏళ్లు పూర్తి చేసుకుంది.

ఉద్యాన వికాసానికి 19 ఏళ్లు

ఉద్యాన వికాసానికి 19 ఏళ్లు

విజయాలు, సవాళ్ల మధ్య వర్సిటీ గమనం

తాడేపల్లిగూడెం రూరల్‌, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): వెంకట్రామన్నగూడెం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యా న విశ్వవిద్యాలయం ఏర్పాటై నేటికి 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. తొలినాళ్లలో ఒక వెలుగు వెలిగి దేశం లోనే అత్యున్నత విద్యాలయాల్లో రెండోదిగా ఖ్యాతి గడించింది. 2007 జూన్‌ 26న అప్పటి సీఎం రాజ శేఖరరెడ్డి చొరవతో ఎమ్మెల్యే కొట్టు సత్యనారా యణ హయాంలో ఇది అవతరించింది. అప్పటి నుంచి ఉద్యాన విద్య, పరిశోధన, విస్తరణ రంగా ల్లో విశేష సేవలందిస్తోంది. తొలినాళ్లలో అప్పటి ఉప కులపతి డాక్టర్‌ శిఖామణి ఆధ్వర్యంలో ఎన్నో పరిశోధనలు చేసి మరెన్నో అవార్డులు అందుకుం ది. తర్వాత సరైన సారధి లేక ఇబ్బందులు పడు తూ ఉంది. అప్పటి నుంచి శాశ్వత ఉపకులపతి లేడు. రిజిస్ట్రార్‌, విస్తరణ సంచాలకులు తదితర కీలక పదవులు ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్నారు. వర్సిటి ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు శాస్త్రవే త్తలు 34 రకాల నూతన వంగడాలను అభివృద్ధి చేసి విడుదల చేశారు.

వర్సిటి పరిధిలో..

వర్సిటీ పరిధిలో ఐదు ఉద్యాన కళాశాల లు, నాలుగు ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాల లు, 20 పరిశోధన కేంద్రాలు, నాలుగు కృషి విజ్ఞాన కేంద్రాలు పనిచేస్తున్నాయి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు అనువైన ఉద్యాన పంట లపై పరిశోధనలు నిర్వహిస్తూ రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. వర్సిటీ పరిధిలో రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్‌గా పునర్‌ నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి భారీగా నిధులు విడు దల చేసింది. శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్స్‌ను సమా యత్తం చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి. జాతీయస్థాయిలో అనేకమంది విద్యా ర్థులు ఫెలోషిప్‌లు సాధించడంతోపాటు అనేక మంది విద్యార్థులు ఉన్నతాధికారులుగా ఉద్యాన అధికారులుగా, ఫీల్డ్‌ ఆఫీసర్‌లుగా ఎంపికయ్యారు. పలువురు విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యా భ్యాసం కొనసాగిస్తున్నారు.

సాధించిన విజయాలు

విశ్వ విద్యాలయం ఇప్పటి వరకు 34 నూతన వంగ డాల రకాలను అభివృద్ధి చేసింది. వీటిలో 2022–23లో 13 సీవీఆర్‌సీ, 10 ఎన్‌వీఆర్‌సీ, 2023లో మరో ఐదు సీవీఆర్‌సీ రకాలు వున్నాయి.

కొబ్బరిచెట్టు ఎక్కే యంత్రం, తాటి ఉత్పత్తుల విలువ జోడింపు సాంకేతికత, జీడిమామిడి ఆపిల్‌ జ్యూస్‌ ప్రొసెసింగ్‌కు మూడు పేటెంట్లు సాధించింది.

భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి నుంచి ఏ గ్రేడ్‌ గుర్తింపు పొందిన విశ్వ విద్యాలయం జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కించుకుంది.

విస్తరణలో విభాగంలో ఉత్తమ సంస్థ అవార్డు, నైపుణ్యాభివృద్ధి అవార్డులతోపాటు వర్సిటీ పరిధిలో పలు పరిశోధన కేంద్రాలు జాతీయస్థాయిలో గుర్తింపు పొందాయి.

నేడు ప్రత్యేక కార్యక్రమాలు

శుక్రవారం వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలకు కేంద్ర మంత్రి శ్రీనివాస వ ర్మను ఆహ్వానించారు. వర్సిటీ విజయాలు ప్రతిబింభించే విధంగా ప్రత్యేక వీడియో ప్రదర్శన, సాంకేతిక కార్యక్రమాలు, ప్రతిభావంతులకు సత్కారం, విశిష్ట సేవలందించిన శాస్త్రవేత్తలకు, ఉద్యోగులకు పురస్కారాలు అందించనున్నారు.

Updated Date - Jun 26 , 2026 | 12:46 AM