విమానాశ్రయంపై ఆశలు
ABN , Publish Date - May 23 , 2026 | 12:47 AM
తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పా టుపై ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు ఆశతో ఎదురు చూస్తున్నారు.
కొత్త డిజైన్‌తో ఢి ల్లీకి ఎమ్మెల్యే బొలిశెట్టి
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పా టుపై ప్రజలతో పాటు ప్రజా ప్రతినిధులు ఆశతో ఎదురు చూస్తున్నారు. వాణిజ్య, విద్యా కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పట్టణంలో విమానాశ్రయం ఏర్పాటైతే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెబుతున్నారు. రూరల్ మండలంలోని వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేటలో విమానాశ్రయం కోసం ప్రతిపాదించిన 1,123 ఎకరాల భూమిని కేంద్ర బృందం గురువారం పరిశీలించిన విషయం తెలిసిందే. ఇక్కడ భూములు అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. అయితే ఐదు కిలీమీటర్ల రన్‌వే ఉండాలంటూ కేంద్ర బృందం ప్రతిపాదించింది. దానికోసం అధికంగా భూములుండాలి. టెర్మినల్, ఇతర అవసరాలకు భూమి అవసరం కానుంది. ఆ మేరకు డి జైన్ రూపొందించాలని కేంద్ర బృందం సూచించి నట్టు సమాచారం. అధికారులు ఆ దిశగా డిజైన్ సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ డిజైన్ తీసుకుని ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర బృందం ఇక్కడ రహదారులు, ఎత్తయిన ప్రదేశాలు, సమీపంలో ఉండే నివాసాలు, తదితర విషయాలను సేకరించింది. ఏపీ నిట్‌తో పాటు, ఆక్వా రంగం, విమానాశ్రయం ఏర్పాటైతే దానికి సమీపంలో ఉండే 30 లక్షల జనాభా తదితర అంశాలను అధికారులతో పాటు, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు. వెంకట్రా మన్నగూడెం, జగ్గన్న పేటలో ఇప్పటికే 1123 ఎకరాల భూములను విమానాశ్రయం కోసం గుర్తించారు.శ్రీకాకుళం జిల్లా పలాసలో విమానాశ్రయానికి కేంద్ర బృందం సానుకూ లత వ్యక్తం చేసినట్టు సమాచారం. అక్కడ జీడిమామిడి పంట అధికంగా ఉంది. ఆ లెక్కన జిల్లాలో ఆక్వా రంగం, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతులకు అవ కాశం ఉంటుంది. ఒకవైపు కార్గో, మరోవైపు పౌరవిమానాశ్రయం ఏర్పాటు చేస్తే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలకు అనుకూలంగా ఉండనుంది. ఇదే విషయాన్ని కేంద్ర బృందా నికి జిల్లా అధికా రులు వివరించే ప్రయత్నం చేశారు. అయితే కొత్తగా ఐదు కిలోమీటర్లు రన్‌వేకు సరి పడేలా భూముల డి జైన్‌ను రూపొందిం చాలని కేంద్ర బృందం సూచిం చింది. భూ సేకరణ విషయం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వమే విమానాశ్రయాలకు భూములు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే తాడేపల్లిగూడెంలో కేంద్ర ప్రభుత్వమే సహకరించాలంటూ ఎమ్మెల్యే బొలిశెట్టి కేంద్ర బృందాన్ని కోరారు. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. కేంద్ర కమిటీ నివేదికే ఇప్పుడు కీలకం కానుంది. ఐదు కిలోమీటర్ల రన్‌వేకు తగ్గట్టుగా భూములు, డిజైన్‌ను తయారు చేసి కేంద్ర బృందానికి పంపనున్నారు. తదుపరి బృందం ఇచ్చే నివేదిక ఆధరంగా కేంద్రప్రభుత్వం విమానాశ్రయ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. కొన్నేళ్ల నుంచి విమానాశ్రయం ఏర్పాటుపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా కేంద్ర బృందం రావడం, రాష్ట్ర ప్రభుత్వం భూములను గుర్తించడం వంటి అంశాలు విమానాశ్రయ ఏర్పాటుకు మరో ముందడుగుగా అంతా భావిస్తున్నారు.