Share News

తణుకులో రెండోరోజు హాకీ చాంపియన్‌షిప్‌ పోటీలు

ABN , Publish Date - Nov 11 , 2026 | 11:45 PM

తణుకు మాంటిస్సోరి స్కూల్‌, జూనియర్‌ కాలేజీలో ఏపీ రోలర్‌, స్కేటింగ్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో రోజు బుధవారం అంతర్‌ జిల్లా రోలర్‌, ఇన్‌లైన్‌ హాకీ చాంపియన్‌షిప్‌ పోటీలు బుధవారం నిర్వహించారు.

తణుకులో రెండోరోజు హాకీ చాంపియన్‌షిప్‌ పోటీలు
తణుకు మాంటిస్సోరి కాలేజీలో హాకీ ఆడుతున్న క్రీడాకారులు

తణుకు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : తణుకు మాంటిస్సోరి స్కూల్‌, జూనియర్‌ కాలేజీలో ఏపీ రోలర్‌, స్కేటింగ్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో రోజు బుధవారం అంతర్‌ జిల్లా రోలర్‌, ఇన్‌లైన్‌ హాకీ చాంపియన్‌షిప్‌ పోటీలు బుధవారం నిర్వహించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 250మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టైనీటాక్స్‌, కేడెట్‌, సబ్‌ జూనియర్స్‌, జూనియర్స్‌, సీనియర్స్‌, బాలురు, బాలికల విభాగంలో తమ క్రీడా ప్రతిభను కనబర్చారు. కార్యక్రమంలో అసోసియేషన్‌ సెక్రటరీ థామస్‌, స్కూల్‌ డైరెక్టర్‌ అనపర్తి ప్రకాశరావు, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ.జ్ఞానమంజరి అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ బి.నాగేంద్రపణి, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 11:45 PM