హైవేపై గోతులకు అతుకులతో సరి..
ABN , Publish Date - Oct 26 , 2026 | 12:58 AM
తీరం వెంబడి వెళుతున్న 216 జాతీయ రహ దారి డోల్లతనానికి మోక్షం లభించడం లేదు.
శాశ్వత పరిష్కారం లేదు
నరసాపురం, అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): తీరం వెంబడి వెళుతున్న 216 జాతీయ రహ దారి డోల్లతనానికి మోక్షం లభించడం లేదు. జిల్లాలో చించినాడ నుంచి భీమవరం మండ లం లోసరి వరకు సుమారు 51కిలోమీటర్ల మేర ఈ రహదారి విస్తరించింది. అయితే దిగమర్రు నుంచి రుస్తుంబాదా వరకు సుమా రు 10 కిలోమీటర్ల రహదారి ప్రారంభం నుం చి గోతులమయంగా మారింది. ప్రధానంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి థామ స్‌వంతెన వరకు, పాలకొల్లు రోడ్‌లో లాకుల నుంచి దిగమర్రు వరకు ఎక్కడ చూసినా.. పెద్ద పెద్ద గోతులే దర్శనమిస్తున్నాయి. ప్రతి నెల ఈ గోతుల్ని సిమెంట్‌తో పూడ్చుతూ కాలయాపన చేస్తున్నారే తప్ప శాశ్వత పరి ష్కారానికి ఎన్‌హెచ్ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికే రహదారి ప్రారం భించి మూడేళ్లు పూర్తయింది. మరో రెండేళ్లు గడిస్తే... నిర్వహణ సమయం కూడా పూర్తవు తుంది. ఆ తరవాత నేషనల్ హైవేనే ఈ పనులు చేపట్టాల్సి ఉంది. గ్యారెంటీ పిరిడ్‌లోనే కాంట్రాక్టుతో డొల్లతనంగా మారిన రోడ్డును పటిష్టపర్చకుండా పూడిక పనులతో కాలయా పన చేయడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. గతంలో ఎన్‌హెచ్ టెక్నికల్ బృందం పలుమార్లు ఈ రహదారిని సందర్శి ంచింది. తరుచూ ఏర్పడుతున్న గోతుల్ని పరిశీలించి కొన్ని సూచనలు ఇచ్చింది. అయితే దీన్ని అధికారులు పెడచెవిన పెడుతున్నారు. గోతుల కారణంగా తరుచూ ప్రమాదాలు ఏర్పడుతున్నాయి.