Share News

రామాలయానికి గ్రీన్‌సిగ్నల్‌

ABN , Publish Date - May 01 , 2026 | 12:47 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ పెదపేటలో రామాలయం నిర్మాణానికి శంకు స్థాపనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వారికి హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది.

రామాలయానికి గ్రీన్‌సిగ్నల్‌
ఆలయ నిర్మాణానికి తెచ్చిన కృష్ణశిల రాళ్లు

మే 3న భూమిపూజ చేసుకోవచ్చు : హైకోర్టు స్పష్టీకరణ

వ్యాజ్యం ఉపసంహరణకు అనుమతించిన న్యాయమూర్తి

అమరావతి, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ పెదపేటలో రామాలయం నిర్మాణానికి శంకు స్థాపనను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన వారికి హైకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆలయ నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్న నేపథ్యంలో మే 3న తలపెట్టిన భూమిపూజ కార్యక్రమాన్ని కొనసాగించ వచ్చని స్పష్టం చేసింది. అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో రామాలయాన్ని నిర్మిస్తు న్నారంటూ పెదపేటకు చెందిన వి.జోష్నదేవి మరో ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు లంచ్‌ మోషన్‌గా విచారణకు స్వీకరిం చింది. శ్రీరామ ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. అధికారులు స్థలాన్ని పరిశీలించి, అది రామాలయం భూమిగా తేలుస్తూ నివేదిక ఇచ్చార న్నారు. 1932 నుంచి అక్కడ రామాలయం ఉన్నట్లు రికార్డుల్లో స్పష్టంగా ఉందన్నారు. పెదపేటలోని సర్వే నం. 470–12లోని భూమిని రెవెన్యూ రికార్డుల్లో రామాలయానికి చెందినదిగా పేర్కొన్నా రని చెప్పారు. రామాలయం పేరు మీద విద్యుత్‌ బిల్లులు చెల్లించారన్నారు. కూలిపోయే దశలో ఉన్న నిర్మాణాన్ని తీసివేసి కొత్తగా ఆలయం నిర్మాణానికి జిల్లా కలెక్టర్‌ ఎన్‌వోసీ ఇచ్చారన్నారు. ఆకివీడు నగర పంచాయతీ కమిషనర్‌ ప్లాన్‌ అప్రూవల్‌ చేసి ఆలయ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారన్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, వివరాలను కోర్టు ముందు ఉంచారు. వీటిని పరిశీలించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ఆలయం నిర్మాణానికి అనుమతులు ఉన్న నేపఽథ్యం లో మే 3న భూమి పూజ చేసుకోవచ్చని స్పష్టత ఇచ్చారు. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించా రు. ఈ దశలో పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ ఆలయం నిర్మాణానికి సంబంధించి ప్లాన్‌, అనుమతులు ఉన్న నేపథ్యంలో వ్యాజ్యాన్ని ఉపసంహరించుకొనేం దుకు అనుమతించాలని కోరారు. ఆలయ ప్లాన్‌, అనుమతులను సవాల్‌ చేసేందుకు వెసులుబాటు ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వాదనలు పరిగణన లోకి తీసుకున్న న్యాయమూర్తి పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేశారు. ఆకివీడు లో అనుమతులు లేకుండా రామాలయాన్ని నిర్మిస్తున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదంటూ పెదపేటకు చెందిన వి.జోష్నదేవి మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆలయ నిర్మాణాన్ని నిలువరించాలని కోరారు. ఈ పిటిషన్‌ ఇటీవల విచారణకు రాగా కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 3న ఆలయం నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నారని, పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని జడ శ్రవణ్‌కుమార్‌ కోరడంతో కోర్టు లంచ్‌మోషన్‌గా విచారణకు స్వీకరించింది. గురువారం విచారణ ప్రారంభమైన వెంటనే న్యాయమూర్తి స్పందిస్తూ... రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన తర్వాత అదే అభ్యర్థనతో పిల్‌ ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు.

జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ... ఆకివీడు మాలపేటలో కూలిపోయే దశలో ఉన్న నిర్మాణంలో కొంత భాగాన్ని గొంతెనమ్మ గుడిగా, మరికొంత భాగాన్ని రచ్చబండగా వినియోగిస్తున్నారని తెలిపారు. సంబంధిత భూమి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారని చెప్పారు. ప్రస్తుతం ఉన్న నిర్మాణాన్ని కూల్చివేశారని, ఆ స్థానంలో అనుమతులు లేకుండా రామాలయం నిర్మిస్తున్నారన్నారు. అక్కడ ఉన్న పెద్ద చెట్టును తొలగించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రభుత్వ స్థలాలు, పార్కులు, వీధుల్లో అనధికార, మతపరమైన కట్టడాలు చేపట్టడానికి వీల్లేదన్నారు. ఆలయం నిర్మాణానికి చేస్తున్న భూమిపూజను అడ్డుకోవాలని కోరారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ఆలయ నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? చెట్టును తొలగించేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. శ్రీరామ ఆలయ అభివృద్ధి కమిటీ తరఫున సీనియర్‌ న్యాయవాది వైవీ రవిప్రసాద్‌ బదులిస్తూ... పిటిషనర్ల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. చెట్టును తొలగించలేదన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను కోర్టు ముందు ఉంచారు. అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ఆలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్నామన్నారు. అనుమతి పత్రాలను కోర్టు ముందు ఉంచారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... రామాలయం నిర్మాణానికి అన్ని అనుమతులు ఉన్న నేపథ్యంలో మే 3న భూమి పూజ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.

రామాలయానికి కృష్ణశిల రాళ్లు

ఆకివీడు, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి):రామాలయం పున:నిర్మాణానికి ప్రత్యేకమైన కృష్ణశిల రాళ్లు గురువారం ఆకివీడు పెదపేటకు చేరుకున్నాయి. కేసుకు సంబంధించి హైకోర్టులో అడ్డం కులు తొలగిపోవడంతో దేవాలయం పున:నిర్మాణం పనులు ఊపందుకున్నాయి. ఈ నెల 3వ తేదీ ఉదయం ఏడు గంటల 14 నిమిషాలకు డిప్యూటీ స్పీకర్‌ కనుమూరు రఘురామకృష్ణరాజు చేతుల మీదుగా భూమిపూజ జరగనున్నది. ఈ చారిత్రాత్మక ఘట్టానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, భక్తులు హాజరుకానున్నారు.

Updated Date - May 01 , 2026 | 12:47 AM