రిజిస్ట్రేషన్ల దూకుడు
ABN , Publish Date - Aug 13 , 2026 | 12:47 AM
జిల్లాలో రిజిస్ర్టేషన్లశాఖలో పలు సంస్క రణలు, వేగవంతంగా లావాదేవీల పూర్తి కావడంతో ఆ శాఖ ఆదాయంలో దూకుడు కొనసాగుతోంది.
గతేడాదితో పోల్చితే మూడు శాతం అదనం
స్లాట్, ఆటో మ్యుటేషన్లతో వేగంగా లావాదేవీలు
జిల్లాలో రిజిస్ర్టేషన్లశాఖలో పలు సంస్క రణలు, వేగవంతంగా లావాదేవీల పూర్తి కావడంతో ఆ శాఖ ఆదాయంలో దూకుడు కొనసాగుతోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలలు పూర్త య్యేసరికి మూడు శాతం ఆదాయం రెట్టింపైంది. దీంతో ప్రభుత్వ రెవెన్యూ లక్ష్యాలను అధిగమించే దిశగా యంత్రాంగం ముందంజ వేసింది.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
ఒకప్పుడు భూములు కొనాలన్మా, అమ్మా లన్నా రిజిస్ర్టేషన్‌శాఖ కార్యాలయాల వద్ద రోజు ల తరబడి కక్షిదారులు, ప్రజలు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చేది. వాటన్నింటికి చెక్ పెడుతూ రిజిస్ర్టేషన్లు, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించడంతో గతే డాది నుంచి వేగంగా రిజిస్ర్టేషన్ల సేవలు జోరు గా సాగుతున్నాయి. తాపీగా అన్ని పనులు చూ సుకుని ఆరామంగా సేవలను పొందుతున్నారు. కార్యాలయాల్లో కిటకిటలు తగ్గి.. వేగంగా ఆదాయం ప్రభుత్వానికి జమ అవుతోంది.
రూ.129 కోట్ల ఆదాయం
జిల్లాలో ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు జిల్లాలో 30,067 డాక్యుమెంట్ల రిజిస్ర్టేష న్లు పూర్తి చేయడం ద్వారా రూ.129 కోట్ల ఆదాయం సమకూరింది. రూ.169 కోట్ల లక్ష్యా నికి 79.87 శాతం ఆదాయం ఆర్జించారు. గతే డాది ఇదే సమయానికి 30,302 డాక్యుమెంట్ లతో రూ.125 కోట్ల ఆదాయ ఆర్జనతో 76.93 శాతం వృద్ధి శాతం నమోదు చేశారు. దాదా పుగా రూ.ఐదు కోట్ల అధికంగానే వసూలైంది. గత నెలలో దస్తావేజు లేఖరుల పెన్‌డౌన్‌తో 12 రోజుల ఆందోళనతో రూ.20 కోట్ల పైబడి ఆదా యానికి ఆటంకంగా పరిణమించింది. అదీ ఈ నెలలో శ్రావణమాసంతో భర్తీ అయ్యే అవకాశం ఉందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
స్లాట్.. ఆటో మ్యుటేషన్లు
అన్ని కాగితాలు తీసుకెళ్లిన తొలి రోజే రిజి స్ర్టేషన్ జరగడం ఒకప్పుడు కష్టంగా ఉండేది. గతేడాది ఏప్రిల్ నుంచి రిజిస్ర్టేషన్ల శాఖలో స్లాట్ బుకింగ్ విధానం తేవడం వల్ల భూము లు అమ్మేవారు, కొనేవారు ఆన్‌లైన్‌లో చలాను లు కట్టి వారికిష్టమైన రోజుల్లోనే స్లాట్ బుక్ చేసుకుని గంటలోపే రిజిస్ర్టేషన్లు ప్రక్రియ ముగించుకుంటున్నారు. ఏ రోజుకా రోజు స్లాట్ కింద బుకింగ్ ద్వారా సమయం వృథా లేకుండా లావాదేవీలు ముగించుకుంటున్నారు. కొద్ది నెలలు క్రితం నుంచి ఆటోమ్యుటేషన్‌లకు అవ కాశం కల్పించడంతో భూమి లేదా ప్లాట్ అమ్మి న తర్వాత గంటలోనే అప్‌డేట్ అయిన దస్తా వేజులు కూడా వారి చేతుల్లోకి వస్తున్నాయి. దీంతో రెండు పనులు ఒకే రోజు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని రిజిస్ర్టేషన్ కార్యాలయంతో పాటు 11 చోట్ల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రోజుకు 200కు పైగా డాక్యుమెంట్ల లావాదేవీలు సాగుతున్నాయి.
ఆలస్యం లేకుండా నిరంతర పర్యవేక్షణలు
జిల్లాలో రిజిస్ర్టేషన్ కార్యాలయాల వద్ద కార్డు 2.0, ఇతర చలానాలు కట్టే విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా అన్ని డాక్యుమెంట్లతో నేరుగా సబ్ రిజిస్ర్టార్ వద్దకు చేరుకునేలా పర్యవేక్షణ జరిగేలా జిల్లా రిజిస్ర్టార్ కె.శ్రీనివాస రావు, డీఐజీ మాధవి నిరంతరం వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహి స్తున్నారు. ఐవీఆర్‌ఎస్ సర్వేల ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన సేవలను అంది స్తున్నట్టు ప్రజలు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. గత నెలలో దస్తావేజు లేఖరులు, ఇతర ప్రైవేట్ సిబ్బంది 12 రోజుల పాటు పెన్‌డౌన్ నిర్వహించడంతో ప్రజలకు ఇబ్బం దులు తలెత్తాయి. అవన్నీ ఈనెల 1వ తేదీ నుంచి పరిష్కారం కావడంతో రిజి స్ర్టేషన్ల ఆదాయం రెండో క్వార్టర్‌లోనూ దూకుడు పెంచే యోచనలో ఉన్నారు. ఇక శ్రావణమాసం ప్రారంభం కానుండడంతో ఆదాయంపై అధికారులు ఆశాభావంతో ఉన్నారు.