Share News

భారీ వర్షం

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:40 AM

వాయుగుండం ప్రభావంతో పాలకొల్లు, ఆచంట మండలాల్లో బుధవారం భారీవర్షం కురిసింది.

భారీ వర్షం
నీట మునిగిన పాలకొల్లు బస్టాండ్‌

పాలకొల్లు, ఆచంట రోడ్లు జలమయం

పాలకొల్లు అర్బన్‌/ఆచంట, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో పాలకొల్లు, ఆచంట మండలాల్లో బుధవారం భారీవర్షం కురిసింది. పాలకొల్లులో ఉద యం నుంచి వర్షం కురవడంతో పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాం డు నీట మునగడంతో ప్రయాణికులు ఇ బ్బందులు పడ్డారు. రోడ్లపై గోతుల్లో వర్షపు నీరు చేరడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం నుంచి వర్షం తగ్గినా ఆకాశం మేఘావృతంగా ఉండటంతో వాతా వరణం చల్లబడింది. ఆచంటలో ఉదయం రెండు గంటలపాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. కచేరి సెంటర్‌లో మార్టేరు వెళ్లే రహదారి నీట మునగడంతో వాహన దారులు ఇబ్బందులు పడ్డారు. పూర్తిస్థాయిలో డ్రెయినేజీ వ్యవస్థ లేకపో వడంతో చిన్నపాటి వర్షానికే కచేరి సెంటర్‌ నీట మునుగుతోందని స్థానికులు పేర్కొ న్నారు. మండలంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో కొన్ని రోజులుగా ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కొంత ఉపశ మనం లభించింది.

Updated Date - Sep 03 , 2026 | 12:40 AM