దంచికొట్టిన వర్షం
ABN , Publish Date - May 11 , 2026 | 12:30 AM
జిల్లాలో ఆదివారం సా యంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు లు చోటు చేసుకుని పలు మండలాల్లో వర్షం దంచి కొట్టింది.
విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్థంభాలు ..పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
మొక్కజొన్న, మామిడి రైతులకు నష్టం
ఏలూరుసిటీ/కొయ్యలగూడెం/పెదపాడు/కామవరపుకోట/బుట్టాయగూడెం/జంగారెడ్డిగూడెం, మే10(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆదివారం సా యంత్రం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు లు చోటు చేసుకుని పలు మండలాల్లో వర్షం దంచి కొట్టింది. ఏజెన్సీ ప్రాంతంలో బలమైన ఈదురుగాలులు, వడగళ్ళతో అకాలవర్షం కురిసింది. వర్షం కారణంగా రహదారులపై ఆర బోసిన ధాన్యం దెబ్బతింటుందని రైతులు వాపో తున్నారు. ఈదురుగాలుల వల్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ద్వారకాతిరుమల క్షేత్రంలో ఆది వారం సాయంత్రం కురిసిన వర్షం వల్ల భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో వర్షం వల్ల పెళ్లిళ్ల వారు అసౌ కర్యా నికి లోనయ్యారు. కొయ్యలగూడెం మండలం కన్నాపురం, డిప్పకాయలపాడు, కొయ్యల గూడెంలో భారీ వర్షం కురవడంతో మొక్క జొ న్న, మామిడి రైతులకు నష్టం జరిగింది. పెద పాడు మండలంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. భారీ వర్షం పడటంతో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయింది. కామవరపుకోట మండలంలో చెట్లకొమ్మలు విరిగి పడడంతో కొత్తూరు– కామవరపుకోట రోడ్డులో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. బుట్టాయగూడెం ఏజెన్సీ ప్రాంతంలో ఈదురు గాలుల కారణంగా చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్థంభాలు, వైర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు చాలాచోట్ల దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏజెన్సీ వ్యాప్తంగా చీకటి అలముకుంది. అకాలవర్షం మామిడి, జీడిమామిడి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. జంగారెడ్డిగూడెంలో 30కు పైగా చెట్లు పైగా కూలిపోవడం, చెట్టు కొమ్మలు విరిగి విద్యుత్ స్థంభాలపై పడడంతో దాదాపు 40 విద్యుత్ స్థంభాలు, ఒక ట్రాన్స్‌ఫార్మర్ నేలకొరిగాయి. పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఏలూరు రోడ్డులోని బస్టాండుకు ఎదురుగా పాన్‌షాపు, బేకరి వద్ద ఉన్న ఓ చెట్టు వేర్లతో సహా పైకి లేచి దుకాణాలపై పడింది. సీపీఎం కార్యాలయం వద్ద చెట్టు కొమ్మలు విరిగి ప్రధాన రహదారిపై పడడంతో వాహనాల రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. పట్టణంలో ప్రజలకు విద్యుత్ సరఫరా అందించడానికి విద్యుత్ శాఖ డీఈఈ పీర్ అహ్మద్‌ఖాన్ ఆదేశాలతో ఏడీఈ సుబ్బారావు సిబ్బందితో మరమ్మతులు చేయిస్తు న్నారు. అయితే రాత్రి 11 గంటల వరకు కూడా పట్టణంలో చాలాప్రాంతాల్లో విద్యుత్ రాక పోవడంతో అంధకారం నెలకొంది.