కుంభవృష్టి
ABN , Publish Date - Nov 05 , 2026 | 01:35 AM
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ వాయుగుండంగా మారినా దాని ప్రభావం తగ్గడం లేదు. రెండు రోజులుగా జిల్లాలో ఎడతెరపి లేకుండానే కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి.
మురసు ప్రభావంతో భారీ వర్షాలు
ఏజెన్సీ ప్రాంతంలో పొంగిన కొండవాగులు.. పలుచోట్ల రాకపోకలు బంద్
వేలేరుపాడు వద్ద తెగిన పెదవాగు రింగ్‌బండ్.. దిగువ గ్రామాలకు వరద ముప్పు
ముంపు ప్రభావిత గ్రామాల నుంచి బాధితుల తరలింపు
ఎర్రకాలువ ప్రాజెక్టుకు భారీగా వరద.. దిగువకు నీటి విడుదల
జిల్లావ్యాప్తంగా 66,295 ఎకరాల్లో పంట పొలాలు మునక
(ఏలూరుసిటీ–అంధ్రజ్యోతి)
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుఫాన్ వాయుగుండంగా మారినా దాని ప్రభావం తగ్గడం లేదు. రెండు రోజులుగా జిల్లాలో ఎడతెరపి లేకుండానే కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో కొండవాగులు పొంగుతున్నాయి. వేలేరుపాడు వద్ద పెదవాగు, బుట్టాయిగూడెం వద్ద కొండవాగుల ఉధృతి ఎక్కువగా ఉండ డంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహి స్తోంది. కొంగువారిగూడెం ఎర్రకాలువ జలా శయానికి ఎగువ ప్రాంతాల నుంచి 76,756 క్యూసెక్కుల నీటి వ్రవాహం వచ్చి చేరుతుండగా దిగువకు 19,756 క్యూసెక్కులు విడుదల చేస్తు న్నారు.వేలేరుపాడులోని పెదవాగుకు తెలం గాణ నుంచి పెద్దఎత్తున వరదనీరు రావడంతో కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు కుక్కునూ రు, వేలేరుపాడు మండలాల్లోని ముంపు గ్రామా ల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
స్తంభించిన జనజీవనం
జిల్లాలో కుంభవృష్టిగా కురుస్తున్న వర్షాల వల్ల జనజీవనం స్తంభించింది. ఏలూరు నగరం లో ఎక్కడ చూసినా వరద నీరే కనబడుతోంది. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, డీఈవో కార్యాల యం, సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలోకి నీరు చేరింది. ఏలూరు నగరంలో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని పలు అండర్‌పాస్‌లను మూసివేశారు. తాడు వాయి– లక్ష్మీపురం గ్రామాల మధ్య జాతీయ రహదారి కోతకు గురి కావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరులో పోలింగ్ స్టేషన్ లోకి నీరు చేరింది. కుక్కునూరు, వేలేరుపాడుకు వెళ్లే మార్గాల్లో చెరువులకు గండ్లు పడ్డాయి. కామవరపుకోట మండలం ఆడమిల్లి సచివా లయం ఎదురుగా ఉన్న వంతెనపైకి భారీగా వరద చేరడంతో ఏలూరు నుంచి జంగారెడ్డి గూడెం వైపు రోడ్డు మార్గం నిలిపివేశారు. బుట్టా యిగూడెం వద్ద కొండవాగులు పొంగడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జల్లేరు ఉధృతి పెరిగింది. ఎర్రకాలువ వరద ఉధృతి క్రమంక్రమంగా పెరుగుతోంది.
పంటలకు అపార నష్టం
జిల్లాలో తుఫాన్‌ల ప్రభావంతో 66,295 ఎకరాల్లో పంట నష్టం ఏర్పడింది. ఇందులో మురసు తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల 28,795 ఎకరాల్లోను, అర్నబ్ తుఫా న్ కారణంగా ఇంకా జిల్లాలో 37,500 ఎకరాల్లోని పంటలు ముంపు బారి నుంచి తేరుకోలేదు. మురసు తుఫాన్ కారణంగా 25 మండలాల్లోని 291 గ్రామాలు ప్రభావానికి గుర య్యాయి. వరి,మొక్కజొన్న, పెసలు, మినుముు, వేరుశనగ, పత్తి, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి.
అధికారులతో కలెక్టర్ టెలీకాన్ఫరెన్స్
జిల్లాలో మురసు తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాల వల్ల వరద నీరు చేరు తోందని, కల్వర్టులు, వాగులు, కాజ్‌వేలు దాటకుండా ప్రమాద హెచ్చరికలు, బారికేడ్లు, ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసేందుకు సిబ్బందిని నియమించాలని కలెక్టర్ వెట్రిసెల్వి సూచించారు. భారీ వర్షాలు , వరద పరిస్థితి, నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎక్కడా ప్రాణనష్టం కలుగ కుం డా చర్యలు తీసుకోవాలని అదేశించారు. ముంపు గ్రామాల్లోని ప్రజలను అత్యవసరంగా సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, బోట్లు సిద్ధం చేయాలని, యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టా లని ఆదేశించారు.మండల, గ్రామస్థాయి అధి కారులు సిబ్బంది సహాయక కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. జేసీ అభిషేకగౌడ, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పునరావాస కేంద్రం పరిశీలన
ఉంగుటూరు: భారీ వర్షాలతో జల దిగ్బం ధంలో చిక్కుకున్న నారాయణపురం ఎస్సీ కాలనీ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరా వాస కేంద్రాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం పరిశీ లించారు. బాధితులను పరామర్శించి వారికి అందుతున్న భోజన, వసతి సౌకర్యాల గురించి అధికారులను ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. తహసీల్దార్ ఎం.సన్యాసిరావు, ఎంపీ డీవో ఇతర అధికారులు పాల్గొన్నారు.
కొయ్యలగూడెంలో 224.4 మి.మీ వర్షపాతం
గత 14 గంటల్లో (బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు) జిల్లాలో అత్యధికంగా కొయ్యలగూడెం మండ లంలో 224.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 42.2 మి.మీ నమోదైంది. జీలుగుమిల్లి 221.6, బుట్టాయిగూడెం 136.8, వేలేరుపాడు 122.6, పోలవరం 120, కుక్కునూరు 93, జంగారెడ్డిగూడెం 88.4 మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.
కామవరపుకోటలో 181 మి.మీ
గత 24 గంటల్లో జిల్లాలోనే అత్యధికంగా కామవరపుకోట మండలంలో 181 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం 114.1 మి.మీ నమోదైంది. ఉంగుటూరు 158.4, చింతలపూడి 155.4, జీలు గుమిల్లి 154, భీమడోలు 153, దెందులూరు 149, ద్వారకాతిరుమల 137.2, టి.నరసాపురం 137, జంగారెడ్డిగూడెం 128.2, లింగపాలెం 123, ముసునూరు 122.8, పెదపాడు 123.2, నిడమర్రు 117.2, కొయ్యలగూడెం 115.6, మండవల్లి 111, ముదినేపల్లి 107.2, ఏలూరు అర్బన్ 104.2. నూజివీడు 95.8, పోలవరం 97.6, పెదవేగి 95.4, కలిదిండి 94.6, ఏలూరు రూరల్ 92, బుట్టాయిగూడెం 93.4, కైకలూరు 75, ఆగిరిపల్లి 74.8, వేలేరుపాడు 73, ఆగిరిపల్లి 74.8, కుక్కునూరు 62.6, చాట్రాయి 63.4, మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.