Share News

నేటి నుంచి హనుమజ్జయంతి వేడుకలు

ABN , Publish Date - May 10 , 2026 | 12:15 AM

గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలను నిర్వహించనున్నారు.

నేటి నుంచి హనుమజ్జయంతి వేడుకలు
మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో విద్యుత్‌ అలంకరణ

మద్ది క్షేత్రంలో వారం రోజులపాటు ఉత్సవాలు

ముస్తాబైన మద్ది ఆలయం

జంగారెడ్డిగూడెంరూరల్‌, మే 9 (ఆంధ్ర జ్యోతి): గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నుంచి 16వ తేదీ వరకు హనుమజ్జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు, దీక్షలతో ఆలయం కళకళలాడనుంది. ప్రతీ ఏటా జరిగే వేడుకల్లో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటారు. విద్యుత్‌ అలంకరణలతో ఆలయం సుందరీకరణంగా ఉంది. ఆదివారం ఉదయం స్వామికి ప్రభాత సేవ, తోమాల సేవ, గోపూజ, పుణ్యహవచనం, దీక్షాధారణ, పంచామృతాభిషే కాల అనంతరం స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. సాయంత్రం అగ్నిప్రతిష్టాపన, హో మాలు, ద్వజారోహణ పూజలు. 11న స్వామికి విశేష లక్ష తమలపాకుల పూజ, 12న హను మద్‌ జయంతి, సామూహిక హనుమద్‌ హో మాలు. 13న సువర్చలా హనుమద్‌ కల్యాణం. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం. 14న వేంకటేశ్వరస్వామి కల్యాణమహోత్సవం. 15న సామూహిక హనుమద్‌ వ్రతాలు, సాయంత్రం మహాశాంతి హోమం. 16వ తేదీ సాయంత్రం ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహ స్తామని ఆలయ ఈవో చందన తెలిపారు.

ఆలయ చరిత్ర

మద్ది ఆంజనేయస్వామి క్షేత్రం గుర్వాయిగూడెంలో ఎర్రకాలువ ఒడ్డున తెల్లమద్ది చెట్టు తొరలో స్వయంభూఃగా వెలసి భక్తకోటి చేత పూజలందుకుంటున్నారు. దేశంలోనే ప్రముఖ హనుమత్‌ క్షేత్రాల్లో ఒకటిగా పేరొంది నిత్యం వేలాది మంది భక్తుల రాకతో కళకళలాడుతుంది. ఈ పవిత్ర స్థలానికి కొన్ని వందల ఏళ్లనాటి చరిత్ర యుగాల నాటి పూర్వగాఽథలు ఉన్నాయని పురాణాలు బట్టి తెలుస్తుంది.

కోర్కెలు తీర్చే ఆంజనేయుడు..

మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకుని మనస్ఫూర్తిగా కోరుకుంటే అవి వెంటనే తీరుతాయని భక్తుల నమ్మకం. ప్రధానంగా వివాహంకాని వారు స్వామివారి సన్నిధిలో ఏడు మంగళవారాలు 108 ప్రదక్షిణలు ఆలయం చుట్టూ చేసినచో వివాహం జరుగుతుందని నమ్మకం. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులున్న వారు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తొలగిపోతాయని నమ్మకం.

Updated Date - May 10 , 2026 | 12:15 AM