Share News

వైభవంగా మద్దిలో సువర్చలా హనుమద్‌ కల్యాణం

ABN , Publish Date - Nov 23 , 2026 | 12:21 AM

గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీకమాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

వైభవంగా మద్దిలో సువర్చలా హనుమద్‌ కల్యాణం
మద్దిలో సువర్చలా హనుమద్‌ కల్యాణం

జంగారెడ్డిగూడెంరూరల్‌, నవంబరు 22, (ఆంధ్రజ్యోతి) : గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో కార్తీకమాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో సువర్చలా హనుమద్‌ కల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఽ ధర్మప్రచార కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్ర వరానికి చెందిన హేమాద్రి బదరీనాథ్‌ రాజరాజేశ్వరి నృత్య మండలి చిన్నారులు ప్రదర్శించిన కూరిపూడి నృత్య ప్రదర్శన భక్తులను విశేషంగా అలరించాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్టు దేవస్థానం ఈవో ఆర్‌వీ చందన తెలిపారు.

Updated Date - Nov 23 , 2026 | 12:21 AM