హ్యాండ్స్ అప్!
ABN , Publish Date - Jul 28 , 2026 | 01:10 AM
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మాంసాహారం, కోడిగుడ్లు అందించే ఒప్పందం నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ పూర్తిగా వైదొలి గింది. దీంతో మాంసాహార సరఫరా కథ మళ్లీ మొదటికొచ్చింది.
మాంసాహార సరఫరా నుంచి వైదొలగిన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ
అడ్డొచ్చిన జీఎస్టీ .. పెట్టుబడులు, బాధ్యతల నిర్వహణే కారణం
వేరే కాంట్రాక్టర్ కోసం యాజమాన్యం వెతుకులాట
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో మాంసాహారం, కోడిగుడ్లు అందించే ఒప్పందం నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ పూర్తిగా వైదొలి గింది. దీంతో మాంసాహార సరఫరా కథ మళ్లీ మొదటికొచ్చింది.
నూజివీడు టౌన్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): గతేడాది దసరా సమయంలో మెస్ టెండర్లు ముగియడంతో ఆర్‌జీ యూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లలో మెస్‌ల నిర్వహణ బాధ్యతను అక్షయ పాత్ర అనుబంధ సంస్థ అయిన హరికృష్ణ హరే రామ మూమెంట్‌కు అప్పగించారు. అయితే తమ సైద్ధాంతికత ప్రకారం తాము అల్లం, వెల్లుల్లి, ఉల్లి తదితర మసాలతో కూడిన ఆహారం ఇవ్వమని, మాంసాహారం అసలే ముట్టమని చెబుతూ శాఖాహారం భోజనం మాత్రమే అందించేందుకు ముందుకు వచ్చింది. ఇందుకుగాను ప్రతి విద్యార్థికి రోజుకు రూ.110 నిర్ణయిం చగా మాంసాహారం, కోడిగుడ్డు అందించేందుకు వారానికి రూ.47లుగా నిర్ణయించారు. అయితే అప్పట్లో కేవలం మాంసాహారం అందించేందుకు ప్రత్యేకంగా ఏ సంస్థ ముందుకు రాకపోవడంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఏర్పడిన స్వచ్ఛంద సేవా సంస్థ హెల్పింగ్ హ్యాండ్స్‌కు మాంసాహారం, కోడిగుడ్లు అందించే బాధ్యతను అప్పగిం చారు. అయితే రూ.47లతో వారానికి ఐదు కోడిగుడ్లు, రెండుసార్లు మాంసాహారం అందించేందుకు ఆర్థిక వెసులు బాటు లేకపోవడంతో విద్యార్థులకు కోడిగుడ్లు మాంసా హారం అంతంత మాత్రంగానే సాగింది. వారానికి మొత్తం నాలుగు కోడిగుడ్లు, ఒక రోజు మాంసాహారం అందించడం తో సరిపుచ్చారు. కాగా నూజివీడు ట్రిపుల్ ఐటీలో దాదాపు 8వేల మంది విద్యార్థులకు మాంసాహారం, గుడ్డు అందిం చేందుకు వాస్తవంగా ప్రత్యేకంగా క్యాటరింగ్ అనుభవం ఉన్న సంస్థల అవసరం ఉన్నా అందుకు విరుద్ధంగా నిర్వ హించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మరోవైపు పూర్తి స్థాయి విద్యార్థులకు గుడ్లు సరఫరా చేయకుండా అందులో సగమే సరఫరా చేశారనే విమర్శలు వచ్చాయి. ఇటు విద్యా ర్థుల విరాళాలతో నిరుపేద విద్యార్థుల ఫీజులు, చార్జీలను అందించేందుకు ఏర్పడిన సంస్థ వ్యాపారత్మక సంస్థగా మారడంతో దానిని జీఎస్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావా ల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పెట్టుబడులు, బాధ్యతల నిర్వహణ, తదితర సమస్యలు ఎదురుకావడంతో గుడ్లు, మాంసాహారం అందించే బాధ్యతల నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ పూర్తిగా వైదొలిగింది.
ఇదిలా ఉంటే వాస్తవంగా వారానికి ఐదు కోడిగుడ్లు, రెండు రోజులు మాంసాహారం అందించాల్సి ఉన్న ట్రిపుల్ ఐటీ యాజమాన్యం గత విద్యా సంవత్సరంలో విద్యార్థులకు నాలుగు కోడిగుడ్లు ఒక్కసారి మాత్రమే మాంసాహారం అందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మూడు కోడిగుడ్లు, ఒకసారి మాంసాహారం అందించేందుకు లోపాయికారిగా మాటలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే కనక జరిగితే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నెలకు రూ.మూడున్నరవేలు వరకు వసూలు చేస్తున్న యాజమాన్యం తాను ప్రకటించిన మెనూను తనే పక్కన పెట్టినట్లు అవుతుంది.
ఇక్కడే ఈ పరిస్థితి..
మాంసాహారం, కోడిగుడ్లు అందించడంలో నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోనే ఈ పరిస్థితి ఉందని మిగిలిన అన్ని చోట్ల పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి ఇబ్బంది లేదని విద్యార్థులు వాపోతున్నారు. మిగిలిన అన్ని చోట్ల గుడ్లు, మాంసాహారం విధిగా అందుతున్నా వీసీ హెడ్ క్వార్టర్‌గా ఉన్న నూజి వీడు క్యాంపస్‌లో సక్రమంగా అందకపోవడంపై విద్యార్థులు వాపోతున్నారు.
మెప్మా ముసుగులో మాంసాహారం అందించేందుకు ప్రయత్నం..
ఇదిలా ఉంటే నూజివీడు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌తో పాటు, ఇదే క్యాంపస్‌లో అంతర్భాగంగా నడుస్తున్న శ్రీకా కుళం, ఒంగోలు పీయూసీ విద్యార్థులకు గుడ్లు, మాంసా హారం అందించేందుకు మెప్మా ముసుగులో శ్రీకాకుళంకు చెందిన ఒక ఉద్యోగితో పాటు ఇప్పటికే క్యాంపస్‌లో మెప్మా పేరుతో దుకాణాలను నడుపుతున్న వ్యక్తి ప్రయ త్నాలు సాగిస్తున్నారు. 0.5 శాతం లాభానికి ట్రిపుల్ ఐటీలోని దుకాణాలను వేరేవారికి కాంట్రాక్ట్ ఇచ్చిన మెప్మా సదరు శాతాన్ని తమకు ఇవ్వకపోవడంపై అసం తృప్తితో ఉంది. తాజాగా కోడిగుడ్డు, మాంసాహారం సర ఫరా విషయంలోనూ ముందుకు వస్తుందా..? అనే అను మానాలు వ్యక్తమవుతున్నాయి.