Share News

నేతన్నకు అండగా..

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:44 AM

కూట మి ప్రభుత్వం చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ పథకం నేత వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందే కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తున్నది. చేనేత కార్మికులకు ఆర్థిక భారం తగ్గించింది.

 నేతన్నకు అండగా..
నేతన్న

నేతన్నకు అండగా..

ఉచిత విద్యుత్‌ పథకం అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం

ఉమ్మడి పశ్చిమలో 910 చేనేత కుటుంబాలకు లబ్ధి

ఏడాదికి రూ.75 లక్షలు ఆదా

ముదినేపల్లి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): కూట మి ప్రభుత్వం చేనేత కార్మికులకు అమలు చేస్తున్న ఉచిత విద్యుత్‌ పథకం నేత వృత్తిపై ఆధారపడి జీవనోపాధి పొందే కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తున్నది. చేనేత కార్మికులకు ఆర్థిక భారం తగ్గించింది. చేనేత వృత్తిని ప్రోత్సహించేందుకు దోహదం చేస్తున్నది. ఈ పథకం కింద సొంత మగ్గంపై చేనేత వృత్తి చేసుకునే వారు వేలాది రూపాయల ప్రయోజనం పొందుతున్నారు. ఈ పథకం కింద హ్యాండ్‌లూమ్స్‌కు 200 యూనిట్లకు, పవర్‌ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. దీంతో మగ్గాలపై చేనేత వృత్తి చేసుకునే నేత కార్మికు లకు ఏడాదికి రూ.8,640, పవర్‌ లూమ్స్‌ కలిగిన కార్మికులకు ఏడాదికి రూ. 21,600 ఆదా అవుతున్నది. ఇది నేత కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందని చెప్పవచ్చు.

ఉమ్మడి పశ్చిమలో : చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ పథకం వల్ల ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మగ్గంపై చేనేత వృత్తి చేసుకునే 900 మంది కార్మికుల కుటుంబాలు, పవర్‌ లూమ్స్‌ నిర్వ హించే పది మంది కార్మిక కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఏలూరు జిల్లాలో 57 చేనేత కుటుంబాలు, పది వపర్‌ లూమ్స్‌ కుటుంబాలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 840 చేనేత కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం అమల్లోకి రాక ముందు ఈ రెండు జిల్లాల్లో విద్యుత్‌ శాఖకు సుమారు రూ.73 లక్షలు, పవర్‌లూమ్స్‌ కార్మికులు రూ. 2.16 లక్షలు బిల్లులు చెల్లించేవారు. ఇప్పుడు ఉచిత విద్యుత్‌ పథకం వల్ల రెండు జిల్లాల్లో 910 చేనేత, పది పవర్‌లూమ్స్‌ కార్మికులు ఏడాదికి సుమారు రూ.75 లక్షలు మేరకు విద్యుత్‌ బిల్లులు చెల్లించనవసరం లేకుండా పోయింది.

వివరాలు సేకరిస్తున్నాం

–హనుమంతరావు, జిల్లా చేనేత, జౌళిశాఖ అభివృద్ధి అధికారి, ఏలూరు

ఈ పథకం కింద ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శక సూత్రాల ప్రకారం ఎంపిక చేసిన చేనేత కార్మికులు లబ్ధి పొందుతున్నారు. సొం త మగ్గం కలిగిన నేత కార్మికుల వివరాలు కూడా సేకరిస్తున్నాం. అర్హులైన చేనేత కార్మికులందరికీ ఉచిత విద్యుత్‌ పథకం వర్తింప చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

చేనేతకు ప్రోత్సాహం

–తుమ్మలచర్ల గణపతి, చేనేత కార్మికుడు, పెదగొన్నూరు, ముదినేపల్లి మండలం

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌ పథకం ఆర్థిక ఆసరా కల్పిస్తు న్నది. చేనేత రంగాన్ని ప్రోత్సహిం చాలన్న ఉద్దేశ్యంతో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం నేత కార్మికుల జీవితాల్లో వెలుగును నింపింది.

Updated Date - Jun 03 , 2026 | 12:44 AM