గురుకుల ప్రవేశ పరీక్షలు ప్రశాంతం
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:57 AM
ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో వివిధ తరగతుల్లో ప్రవేశాలకు శుక్రవారం ఏలూరులో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.
ఏలూరు అర్బన్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఏపీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో వివిధ తరగతుల్లో ప్రవేశాలకు శుక్రవారం ఏలూరులో నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని ముసునూరు, అప్పలరాజుగూడెం, నాగిరెడ్డిగూడెం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 5,6,7,8 తరగతుల్లో ప్రవేశాలకు ఉదయం నిర్వహించిన పరీక్షకు 901 మంది దర ఖాస్తు చేసుకోగా 714 మంది (79.25 శాతం) హాజరయ్యారు. రాష్ట్రంలోని ఏపీ రెసిడెన్షియల్ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు మధ్యాహ్నం నిర్వహిం చిన పరీక్షల్లో ఇంటర్మీడియట్ ప్రవేశపరీక్షకు 1,604 మంది దరఖాస్తు చేసుకోగా 1,440 మంది, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు 26 మంది దరఖాస్తు చేసుకోగా 23 మంది హాజరయ్యారు. జవాబులతో కూడిన ఓఎంఆర్ షీట్ల బండిళ్లను ఏలూరు సెయింట్ గ్జేవియర్ హైస్కూలుకు తరలించి అక్కడి నుంచి పోలీసు బందోబస్తు నడుమ అమరావతికి మూల్యాంకనం నిమిత్తం తరలించారు. ఫలితాలు 15 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్ష కేంద్రాలను జిల్లా కన్వీనర్, ముసునూరు ఏపీఆర్‌ఎస్ ప్రిన్సిపాల్ కె.లక్ష్మీకుమారి, డీఈవో వెంకటలక్ష్మమ్మ, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఆశ, తదితరులు తనిఖీ చేశారు.