Share News

సేవా మూర్తులకు గుప్తా అవార్డులు..

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:54 AM

ప్రముఖ వ్యాపారవేత్త, కేకే గ్రూపు సంస్థల అధినేత, గుప్తా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మడుపల్లి మోహన గుప్త(ఎం.ఎం.గుప్త) తన జన్మదినం సందర్భంగా ఏటా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి గుప్తా అవార్డులు, తన తండ్రి మడుపల్లి కృష్ణమూర్తి పేరుతో సా హిత్య పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలి పారు.

సేవా మూర్తులకు గుప్తా అవార్డులు..
ఎం.ఎం.గుప్తా దంపతులను సత్కరిస్తున్న ప్రతినిధులు

సేవా మూర్తులకు గుప్తా అవార్డులు..

15న అందజేయనున్నట్టు నిర్వాహకుల ప్రకటన

ఏలూరురూరల్‌, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ప్రముఖ వ్యాపారవేత్త, కేకే గ్రూపు సంస్థల అధినేత, గుప్తా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు మడుపల్లి మోహన గుప్త(ఎం.ఎం.గుప్త) తన జన్మదినం సందర్భంగా ఏటా వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి గుప్తా అవార్డులు, తన తండ్రి మడుపల్లి కృష్ణమూర్తి పేరుతో సా హిత్య పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలి పారు. ఈ ఏడాది ఇద్దరికి అవార్డులు, మరొక రికి సాహిత్య పురస్కారం అందజేయనున్నట్టు వెల్లడించారు. శనివారం ఏలూరులోని వైఎం హెచ్‌ఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మోహన్‌ గుప్తా, ఆడిటర్‌ డీవీ సుబ్బా రావు ఈ వివరాలు తెలిపారు. గుప్తా అవార్డు లకు 92 ఏళ్ల వయసులోనూ వైద్య సేవలంది స్తున్న వైద్యురాలు సూరి(ఏలూరు), వందేళ్లు పూర్తి చేసుకున్న ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి(సోమవరప్పాడు) ఎంపికైనట్టు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల నగదు, జ్ఞాపిక, సన్మాన పత్రం అందజేస్తామ న్నారు. కృష్ణమూర్తి సాహిత్య పురస్కారానికి ప్రముఖ సాహిత్య విమర్శకురాలు, పరిశోధకు రాలు ప్రొఫెసర్‌ కేతవరపు కాత్యాయనీ విద్మహే (ప్రకాశం)కు అందజేస్తామన్నారు. రూ.3 లక్షల నగదు, జ్ఞాపిక, సన్మానపత్రం అందజేయనున్న ట్లు పేర్కొన్నారు. నవం బరు 15న ఏలూరులో పురస్కార ప్రదానోత్సవం నిర్వహిస్తామన్నారు. పవర్‌పేటలోని కంచికామకోటి పీఠ వేదపాఠ శాలకు రూ.50 లక్షలతో 10 కిలోవాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ఫౌండేషన్‌ అందించింది. విద్య, వైద్య సామా జిక, సాహిత్య రంగాలకు అందిస్తున్న సేవ లకు వైఎంహెచ్‌ఏ సంస్థతో పాటు, 49 సేవా, ఆధ్యాత్మిక, విద్యాసంస్థల సమిష్టి ఆధ్వ ర్యంలో ఎంఎం గుప్తా ఆయన, సతీమణి మల్లే శ్వరి దంపతులను ఘనంగా సత్కరించారు. వైఎంహెచ్‌ఏ ప్రతినిధులు కేవీ సత్యనారాయణ, కొత్త కౌశలేందర్రావు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, మజ్జి కాంతా రావు, మేయర్‌ అభ్యర్థి రెడ్డి అప్పల నాయుడు, గుప్తా సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 12:54 AM