వైద్య సేవలు అందుతున్నాయా ?
ABN , Publish Date - May 12 , 2026 | 12:33 AM
ఆసు పత్రి ప్రసూతి విభాగంలో వైద్య సేవలు అందు తున్నాయా ? అని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్య నారాయణరాజు ఆరా తీశారు.
తాడేపల్లిగూడెం ఆసుపత్రిలో ‘బాలల హక్కుల చైర్మన్’ సందర్శన
తాడేపల్లిగూ డెం రూరల్, మే 11 (ఆంధ్రజ్యోతి): ఆసు పత్రి ప్రసూతి విభాగంలో వైద్య సేవలు అందు తున్నాయా ? అని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటుకూరి ఏవీఎస్ సూర్య నారాయణరాజు ఆరా తీశారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిని సోమవారం రాత్రి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల హక్కులు పరిరక్షించి వారికి మరింత మెరుగైన సేవలను అందించేందుకు ప్రభుత్వానికి కమిషన్ తగిన సిఫార్సు చేస్తుందన్నారు. ఈ సందర్బంగా ప్రసూతి వార్డులో బాలింతలతో మాట్లాడారు. ప్రసవించిన పసిబిడ్డల తల్లులను ఆసుపత్రి సేవలపై అడిగి తెలుసుకున్నారు. బీజేపి నియోజకవర్గ ఇన్‌చార్జి ఈతకోట తాతాజి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైడికొండల సింధూ, పట్టణ అధ్యక్షుడు దువ్వ శ్రీను, అసుపత్రి అబివృద్ది కమిటి సభ్యులు గొట్టుముక్కల గణేష్, బీజేపి పట్టణ ప్రదాన కార్యదర్శి చిట్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.