భూగర్భ జలాల రీచార్జ్
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:33 AM
జిల్లాలో భూగర్భజలాల వృద్ధికి యంత్రాంగం దిదు ్దబాటు చర్యలకు ఉపక్రమించింది. గతేడాది డిసెంబరు లో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లాలో భూగర్భజలాలు దిగజారిపోవడంపై సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్య వ్యక్తం చేశారు.
నీటిమట్టాల పెంపునకు బావులు
జిల్లాలో మూడు చోట్ల ప్రతిపాదనలు
భవిష్యత్తులో పలుచోట్ల విస్తరణ
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో భూగర్భజలాల వృద్ధికి యంత్రాంగం దిదు ్దబాటు చర్యలకు ఉపక్రమించింది. గతేడాది డిసెంబరు లో జరిగిన కలెక్టర్ల సదస్సులో జిల్లాలో భూగర్భజలాలు దిగజారిపోవడంపై సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్య వ్యక్తం చేశారు. అప్పట్లో 16.28 మీటర్లకు పలు మండ లాల్లో పాతాళంలోకి నీటిమట్టాలు పడిపోయాయి. ఇటీ వల కొంత మెరుగుపడినా తీవ్రతను మరింత తగ్గించే దిశగా జలధార–జలహారతి కింద పలు శాఖల ద్వారా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అటవీశాఖ ద్వారా చెక్ డ్యామ్‌లు, కందకాలు తవ్వకాలకు ఏర్పాట్లు చేస్తుండగా, తాజాగా గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ ద్వారా రీఛార్జి బావులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
జిల్లాలో ప్రస్తుతం మూడుచోట్ల..
భూగర్భజలాలు అడుగంటిపోతున్న గ్రామాల్లో దిద్దు బాటు చర్యల్లో భాగంగా వర్షపునీటిని భూమిలోకి పంపేందుకు ప్రత్యేక రీచార్జ్ బావుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముసునూరు మండలం గుళ్లపూడి నల్లచెరువు, లింగపాలెం మండలం ఆశన్న గూడెం కల్లేపల్లి చెరువు, కొయ్యలగూడెం పరింపూడిలోని
అనకాల చెరువు ప్రాంతాల్లో రూ.1.80 లక్షల వ్యయంతో రీచార్జ్ బావుల నిర్మాణా నికి రంగం సిద్ధం చేశారు. ఈ మూడు ప్రాంతాల్లో నీరుపడే చోట్ల బోర్లు వేసి నీటిని భూమిలోకి పంపుతారు. ఈ విధానం ద్వారా ఆయా గ్రామాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందు తాయని భావిస్తున్నారు. ప్రస్తుతానికి మూడు చోట్ల రీచార్జ్ బావులను ప్రతిపాదించామని, తదనందతరం విస్తరణకు చర్యలు చేపడతామని గ్రౌండ్‌వాటర్ డిపార్టుమెంట్ డిప్యూటీ డైరెక్టర్ కోదండరామ్ తెలిపారు.