Share News

చురుగ్గా గ్రీన్‌సిటీ సీసీ రోడ్డు

ABN , Publish Date - May 31 , 2026 | 12:45 AM

అఽధ్వా నంగా ఉన్న ఏలూరులోని గ్రీన్‌సిటీ రోడ్డుకు ఎమ్మెల్యే బడేటి చంటి కృషితో శోభ సంతరించుకుంటోంది.

చురుగ్గా గ్రీన్‌సిటీ సీసీ రోడ్డు
గ్రీన్‌సిటీలో రోడ్ల పనులను పరిశీలిస్తున్న కాలనీవాసులు

హర్షం వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాకు స్పందన

ఏలూరు, మే 30(ఆంధ్రజ్యోతి) : అఽధ్వా నంగా ఉన్న ఏలూరులోని గ్రీన్‌సిటీ రోడ్డుకు ఎమ్మెల్యే బడేటి చంటి కృషితో శోభ సంతరించుకుంటోంది. ‘ఏబీఎన్‌– ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో మార్చి 15న నగరంలోని 19 డివిజన్‌ గ్రీన్‌సిటీలో ‘అక్షరం అండగా... పరిష్కా రమే అజెండాగా’ కార్య క్రమంలో భాగంగా ఎమ్మె ల్యే బడేటి రాఽధాకృష్ణయ్య (చంటి) ఇచ్చిన హామీ మేరకు 1.09 కోట్ల వ్యయం తో చేపట్టిన సీసీ రోడ్డు పనులు చురుగ్గా సాగు తున్నాయి. నాణ్యంగా రోడ్డు కిరువైపులా సీసీ రోడ్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. శనివారం రోడ్డు నిర్మా ణ పనులను గ్రీన్‌సిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ కార్యదర్శి కె.సాంబశివరావు, 19వ డివిజన్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జి పైడి వెంకట్రా వు, కాలనీ వ్యవస్థాపకులు బ్రహ్మం రాజు, స్థానికులు పరిశీలించి హర్షం వ్యక్తం చేశా రు. జూన్‌ 20లోగా పనులు పూర్తవుతాయని కాంట్రాక్టర్‌ చెప్పారు.

Updated Date - May 31 , 2026 | 12:45 AM