గలగలా పారేలా.. కాల్వలు కళకళలాడేలా చెరువులు
ABN , Publish Date - May 06 , 2026 | 12:31 AM
జిల్లాలో కాల్వలు, చెరువుల సమస్యకు మోక్షం కలగనుంది. ఓఅండ్‌ఎం పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
గలగలా పారేలా.. కాల్వలు
కళకళలాడేలా చెరువులు
జిల్లాలో ఓ అండ్‌ఎం పనులకు పచ్చజెండా
రూ.4 కోట్లు కేటాయింపు..
నామినేషన్ ప్రాతిపదికన పనులు
సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహణ
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో కాల్వలు, చెరువుల సమస్యకు మోక్షం కలగనుంది. ఓఅండ్‌ఎం పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కాల్వలు కట్టేసిన 10 రోజులకు రూ.4 కోట్లతో పనులు చేపట్టే విధంగా నిధుల మంజూరుకు ఆమోదముద్ర వేసింది. ఎమ్మెల్యేల సిఫార్సులకు, ప్రతిపాదనలకు ఊతమిస్తూ మైన ర్ ఇరిగేషన్ చెరువులు, చెరువుగట్లు పటిష్టం, తూడు, గుర్ర పుడెక్క తొలగింపు, షట్లర్ల మరమ్మతు పనులకు నిధుల కేటాయించారు. ధవళేశ్వరం చీఫ్ ఇంజనీర్ స్థాయిలో నిధు లు మంజూరయ్యాయి. సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టనున్నారు. నామినేషన్ల కింద రూ.5 లక్షల వ్యయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారు.
తమ్మిలేరుకు మహర్దశ
ఏలూరు నగరం, పరిసరాల్లో విస్తరించిన తమ్మిలేరులో పూడిక తొలగింపు, షట్టర్ల మరమ్మతు, గట్టు పటిష్టత తది తర పనులకు రూ.1.4 కోట్లు కేటాయించారు. జంగిల్స్ క్లియ రెన్స్, పూడిక తొలగింపు, ఇతర పనులు ప్యాకేజీలుగా విభ జించారు. రామ చంద్రాపురంలో తమ్మిలేరు ఎడమ గట్టు పటిష్టతకు రూ.10 లక్షలు, పెదపాడు మేజర్ డ్రెయిన్ చెక్ డ్యామ్‌కు రూ.8.85 లక్షలు, చొదిమెళ్ల దొండపాడు ట్యాంక్‌కు రూ.8.20 లక్షలు, రాయుడు ట్యాంక్‌కు రూ.8.90 లక్షలు, కొమడవోలు తూర్పు తమ్మిలేరు డ్రెయిన్‌కు రూ.9.95 లక్షలు, దొండపాడు స్లూయిజ్‌కు రూ.7.40 లక్షలు, వరద నివారణకు రూ.9.70, జంగిల్ క్లియరెన్స్‌కు రూ.19.75 లక్షలు, పశ్చిమ డ్రెయిన్ లెఫ్ట్ బ్యాంక్‌కు రూ.9.60 లక్షలు కేటాయించారు.
ఎక్కెడెక్కడ ఎన్ని ?
భీమడోలు పెద్ద ట్యాంక్‌కు రూ.7 లక్షలు, బాపిరాజు గూడెం పెద్ద ట్యాంక్‌కు రూ.10 లక్షలు, బుట్టాయగూడెం జల్లేరు జలాశయం గుబ్బల మంగమ్మ గుడి వద్ద అలివేరు నిర్వహణకు రూ.9.99 లక్షలు, ఎల్‌ఎన్‌డీ పేట ఎర్త్ డ్యామ్ స్పిల్‌వే జనరేటర్ నిర్వహణకు రూ.9 లక్షలు, సరిపల్లి లో బందకట్టు సప్లయ్ ఛానల్‌కు రూ.9.85 లక్షలు, బొత్తప్పగూ డెం వద్ద పూడిక తొలగింపునకు రూ.6.50 లక్షలు, వేదాంత పురం మురుగుకన్నం ఛానెల్‌కు రూ.9.80లక్షలు, రాళ్లకన్నం నుంచి గంగరాజు కన్నం ఛానల్ పనులకు రూ.9.90లక్షలు, శేరికన్నం నుంచి బంధకట్టు మెయిన్ ఛానల్‌కు రూ.9.70 లక్షలు, దిప్పకాయలపాడులో చౌదరి ట్యాంక్‌కు రూ.9.90 లక్షలు, కోయరాజమండ్రి డోలుగూడెం సప్లయ్ ఛానల్ మరమ్మతులకు రూ.9.80 లక్షలు, కన్నాపురం వాడిసెలవారి ట్యాంక్‌కు రూ.9.90 లక్షలు, పరింపూడిలోని గోపాలపురం సప్లయ్ ఛానల్‌కు రూ.5.85 లక్షలు, పాత పోలవరంలో డీవాటరింగ్ డ్రెయిన్ వాటర్ కలెక్షన్‌కు తాత్కాలిక పంపులు, ఇతర ఏర్పాట్లకు రూ.9.50 లక్షలు, కొంగువారిగూడెం యర్ర కాల్వ స్పిల్‌వే గేట్స్ మరమ్మతులకు రూ.9.98 లక్షలు, కె.గోకవరం చక్రిరేవుపాడు, టీసీఆర్ పాలెం, బాదరాల, బో గోలు, మఠంగూడెం, సూరసముద్రం, వేములపల్లి, సింగ గూడెం, ఆశన్నగూడెం, వెంకటాపురం, కొత్తపల్లి, కొణిజర్ల, ధర్మాజీగూడెం, రాపాక, మల్లసుమద్రం, రేగుంట, మల్లేశ్వరం బూరుగుకుంట, అంతాస్యగ్రమం, అంకమ్మకుంట, రాఘవా పురం, అక్కస అగ్రహారం, పోతునూరు, మల్లాయగూడె, కంజుబంధం, గణిజర్ల, జువ్వికుంట, పానలకాల, మడుగు కుంట, చక్కలవంతెన, గోపిదేవకుంట, మడపాక, దేశవరం, నరసింహగట్టు, నరసన్నపాలెం, బట్టువారిగూడెం ప్రాంతా ల్లోని ట్యాంకులు, చెరువుల అభివృద్ధికి రూ.1.5 లక్షల చొప్పు న మంజూరయ్యాయి. యండ్లపల్లిలో లింగసముద్రం చెరువుకు రూ.3 లక్షలు, చింతలపూడి శివాపురంలో మొండికుంట చెరువుకు రూ.10 లక్షలు, ప్రగడవరం వెలగలపల్లి చెరువుకు రూ.8లక్షలు, మర్రికుంట చెరువు అభివృద్ధికి రూ.9 లక్షలు చొప్పున మంజూరు చేశారు.