Share News

సత్తాల చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:12 AM

రాత్రి, పగలు తేడా లేకుండా సంపాధనే ధ్యేయంగా కొందరు అక్ర మార్కులు మట్టి తవ్వకాలకు పాల్పడు తున్నారు.

సత్తాల చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు
సత్తాల చెరువులో రాత్రివేళ మట్టి తవ్వుకుంటున్న అక్రమార్కులు

ద్వారకాతిరుమల, ఏప్రిల్‌ 10 (ఆం ధ్రజ్యోతి): రాత్రి, పగలు తేడా లేకుండా సంపాధనే ధ్యేయంగా కొందరు అక్ర మార్కులు మట్టి తవ్వకాలకు పాల్పడు తున్నారు. ఒక్కో టిప్పర్‌ను మట్టి దూ రాన్ని బట్టి రూ.10 వేల నుంచి 15 వేల వరకు విక్రయిస్తూ జేబులు నింపుకుం టున్నారు. మండలంలోని సత్తాల గ్రామంలో సర్వేనెంబరు 205లో ఎ. 32.48ల విస్తీర్ణంలో సత్తాల ఇరిగేషన్‌ చెరువు ఉంది. కొందరు అక్రమార్కుల కన్ను దీనిపై పడింది. ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి చెరువు ఆకృతిని దెబ్బ తీస్తున్నారు. ఈ చెరువు మట్టిని ట్రిప్పర్ల ద్వారా రావులపాలెం తరలిస్తున్నట్లు చెబు న్నారు. ఇద్దరు వ్యక్తులు పోటాపోటీగా తవ్వకాలు జరుపుతూ ఈ మట్టి దందా సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

కలెక్టర్‌ ఆదేశాలు బుట్టదాఖలు

చెరువుల్లో అక్రమమట్టి తవ్వకా లు జరిపి రవాణా చేసేవారిపై కేసులు నమోదు చేయాలని గత నెల కలెక్టర్‌ తహసీల్ధార్లు, ఇరిగేషన్‌, గనుల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. రెవిన్యూ, పోలీస్‌, ఇరిగేషన్‌ సిబ్బందితో పటి ష్టమైన నిఽఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడ ంతో పలుఅనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ మట్టి మాఫియాను అరికట్టాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:12 AM