గట్టు స్వాహా!
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:27 AM
)వైసీపీ ఐదేళ్ల అరాచక పాలన పోలవరం కుడికాలువ గట్టును కరిగించింది. అధికారాన్ని అడ్డుపె ట్టుకుని కొండలా ఉన్న గట్టును గుటకాయ స్వాహా చేశారు.
వైసీపీ పాలనలో పోలవరం కుడికాలువ గట్టు మాయం.. కాలువ వెంబడి పంటల సాగు
కొన్నిచోట్ల దిగువకు పొంచివున్న ప్రమాదం
పట్టించుకోని సంబంధిత అధికారులు
పెదవేగి, ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి)వైసీపీ ఐదేళ్ల అరాచక పాలన పోలవరం కుడికాలువ గట్టును కరిగించింది. అధికారాన్ని అడ్డుపె ట్టుకుని కొండలా ఉన్న గట్టును గుటకాయ స్వాహా చేశారు. కాలువకు ఇరువైపులా గట్టు ఎక్కడా ఉంది.. అంటూ వెతుకులాడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. గట్టును తవ్వేయడంతో ఇప్పుడు పంటభూమిగా మారిపోయింది. కాలువ గట్లను కుదిమట్టానికల్లా తవ్వేయడంతో కొన్నిచోట్ల కాలువ గట్టుకు ప్రమాదం పొంచి ఉంద ని దిగువ గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
పోలవరం కుడికాలువ దెందులూరు నియోజకవర్గంలో దెందు లూరు మండలంలో పెరుగ్గూడెం వద్ద మొదలై చల్లచింతలపూడి, రామారావుగూడెం, మేదినరావుపాలెం నుంచి పెదవేగి మండలం లో ముండూరు దగ్గర ప్రవేశించి కొప్పులవారిగూడెం, లక్ష్మీపురం, గార్లమడుగు, కవ్వగుంట, జగన్నాఽథపురం, జానంపేట, అంకన్న గూడెం, కొప్పాక, పెదకడిమి, భోగాపురం గ్రామాల మీదుగా కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తుంది. అప్పట్లో కాలువ తవ్వకంతో వచ్చిన మట్టితో కాలువ సంరక్షణ కోసం ఇరువైపులా గట్టు నిర్మించారు. ఒక్కోచోట కాలువ లోతును బట్టి మట్టి ఎక్కువగా రావడంతో కాలువకు ఇరు వైపులా కొండలు పుట్టుకొచ్చాయా అన్నట్టుగా భారీ మట్టిగుట్టలు ఏర్పడ్డాయి. అయితే ఆ గుట్టలు ఇప్పుడు చూద్దామన్నా కనిి పంచడం లేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిననాటి నుంచి 2024లో గద్దె దిగేవరకు వైసీపీ నాయకులు ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వుకుపోవడంతో కాలువ గట్టు మాయమైంది. దీంతో ఆ భూమి లో సరిహద్దు రైతులు పంటలసాగు చేపట్టారు. అరటి, మొక్క జొన్న, పశుగ్రాసం, కూరగాయలు, ఇతర పండ్ల తోటలను సాగు చేస్తున్నారు. రైతుల నుంచి సంబంధిత శాఖాధికారులు ముడు పులు తీసుకుని పంటల సాగుకు అవకాశం ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాగన్నగూడెం చినసాయిబాబా ఆలయం దగ్గర కాలువ లోతు ఎక్కువగా ఉంటుంది. కాలువకు ఇరువైపులా మరింత వెడల్పుగా భారీగా మట్టిని గట్టుగా పోశారు. కానీ అక్కడ ఇప్పుడు ఎలాంటి గట్టు ఆనవాళ్లు కనిపించడం లేదు. అక్కడ మొక్కజొన్న, అరటి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. లక్ష్మీపురం, గార్లమడుగు, కవ్వగుంట, జగన్నాథపురం, పెదకడిమి, భోగాపురం, కొప్పాక ప్రాంతాల్లోనూ పంటల సాగు చేపట్టారు. కాలువ సంరక్షణను అధికారులు పట్టించుకోవడం లేదని, ఇదిలాగే కొనసాగితే కాలువ మనుగడకే ప్రమాదం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు కాలువ గట్టు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.