ఎండు గడ్డికి గిరాకీ
ABN , Publish Date - Apr 29 , 2026 | 12:32 AM
ఏటా మాదిరిగానే ఈ ఏడాది యంత్రాలతో వరికోత చేపట్టడంతో ఎండుగడ్డి కొరత ఏర్పడి పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి.
ట్రక్కు రూ.12 వేలు
కాళ్ల, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి):ఏటా మాదిరిగానే ఈ ఏడాది యంత్రాలతో వరికోత చేపట్టడంతో ఎండుగడ్డి కొరత ఏర్పడి పాడి రైతులకు కష్టాలు మొదలయ్యాయి. దీంతో వేలకు వేలు వెచ్చించి గడ్డిని నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు కాళ్ల మండలంలో వరి సాగు అధికంగా ఉండేది. రానురాను తగ్గిపోతూ 3 వేల ఎకరాలకు పడిపోయింది. ఈ ప్రాంతంలో దాదాపు వరిరైతులు ఎక్కువగా పాడి రైతులుగా ఉన్నారు. పశుగ్రాసం కోసం ఉన్న గడ్డి సరిపోదనే ఉద్దేశంతో పక్క జిల్లాల నుంచి కొనుగోలు చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ దొరికే గడ్డి ఎకరాకు రూ. 8 వేలు ఖర్చు పెడుతుంటే పక్క జిల్లాల నుంచి రూ. 10నుంచి 12 వేల వరకూ వెచ్చించాల్సి వస్తుంది. పశు పోషణే జీవనాధారంగా ఎంచుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎకరాకు రూ.8 వేలకు పైగా ఖర్చు
నియోజకవర్గ పరిధిలో ఎకరానికి రూ. 1500 గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. దీనిని ట్రాక్టర్‌లో లోడ్ చేయడానికి ఆరుగురు కూలీలు కావాలి. ఒక్కొక్కరికీ రూ.650 చెల్లిస్తున్నారు. ఆ గడ్డిని నిల్వ చేసే ప్రాంతానికి ట్రాక్టర్‌కు 2 నుంచి 3 వేలు అదనపు ఖర్చు అవుతోంది.