16 మంది గ్రేడ్–1 వీఆర్‌వోలకు పదోన్నతులు
ABN , Publish Date - Jan 08 , 2026 | 12:48 AM
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 16మంది గ్రేడ్ –1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కల్పించగా అందులో పది మంది వీఆర్వోలను పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు సీనియర్ అసి స్టెంట్లుగా, ప్లేస్మెంట్‌లు ఇచ్చి నియామక పత్రాలను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అందజేశారు.
భీమవరం టౌన్, జనవరి7(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 16మంది గ్రేడ్ –1 వీఆర్వోలకు సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులను ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి కల్పించగా అందులో పది మంది వీఆర్వోలను పశ్చిమ గోదావరి జిల్లాకు కేటాయించగా పదోన్నతి పొందిన వీఆర్వోలకు సీనియర్ అసి స్టెంట్లుగా, ప్లేస్మెంట్‌లు ఇచ్చి నియామక పత్రాలను జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు మాట్లాడుతూ పదోన్నతులు పొందిన మన గ్రేడ్–1 వీఆర్వోలకు శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతులు పొందిన వారికి కావలసిన చోట పోస్టిం గులు ఇవ్వడానికి అంగీకరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్‌రెడ్డి, డీఆర్‌వో నారాయణరెడ్డికి సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు జకరయ్య, సీనియర్ అసిస్టెంట్‌లుగా ప్రమోషన్లు పొందిన రత్నరాజు, ఉమా రామలక్ష్మి, పద్మనాభం, అయినవిల్లి శ్రీనివాస్, వీరభద్రరావు, టి. శ్రీనివాసరావు, నరసింహా రావు, వెంకట శ్రీనివాసరావు, ఆర్‌ఎంఎస్ లక్ష్ష్మీ కుమారి, తదితరులు ఉన్నారు.