ఆద్యంతం ఉల్లాసంగా..
ABN , Publish Date - Apr 03 , 2026 | 01:15 AM
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పోలవరం ప్రాజెక్టు పర్యటన ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. ప్రాజెక్ట్ చరిత్రలో ఓ గవర్నర్ పర్యటించడం ఇదే తొలిసారి.
గవర్నర్ పోలవరం పర్యటన సక్సెస్
రెండు గంటలపాటు ప్రాజెక్టు పరిశీలన
ఏలూరు/పోలవరం, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పోలవరం ప్రాజెక్టు పర్యటన ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. ప్రాజెక్ట్ చరిత్రలో ఓ గవర్నర్ పర్యటించడం ఇదే తొలిసారి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుతో ఒకసారి పోలవరం పర్యటనకు వస్తానని చెప్పిన గవర్నర్ ఆ మేరకు ప్రాజెక్టు సందర్శనకు గురువారం రాగా ప్రజాప్రతినిఽధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రెండు గంటల పాటు ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద పరిశీలన, సమీక్షలతో ఆయన ఉత్సాహంగా గడి పారు. ఎస్పీ కేపీఎస్ కిశోర్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తొలుత ప్రాజెక్టు హిల్ వ్యూ ప్రాంతంలో ఉన్న హెలీప్యాడ్ వద్ద గవర్నర్‌కు మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కిశోర్, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. అధికారులను, ప్రజాప్రతినిధులను గవర్నర్ ఆప్యాయంగా పలకించి ఫొటోలు దిగారు. అనంతరం గవర్నర్ హిల్‌వ్యూ ప్రాంతం నుంచి స్పిల్‌వే ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీరింగ్ చీఫ్ ఎన్.నరసింహమూర్తి, ఇతర ఇంజనీరింగ్ అధికారులను సంబంధిత వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు అతిఽథి గృహంలో భోజన విరామానంతరం ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీ క్షించారు. మధ్యాహ్నం 3.46 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి వెళ్ళారు. క్వాలిటీ కంట్రోల్ ఎస్‌ఈ తిరుమలరావు, జలవనరులశాఖ ఎస్‌ఈ రామచంద్రరావు, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, జేసీ అభిషేక్ గౌడ, ఏఎస్పీలు సుస్మిత, జయాశర్మ, హేమంత్, పంకజ్‌మీనా, మునిరాజు, ఆర్డీవో రమణ, జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్ రెడ్డి, ఐటీడీఏ పీవో రాములు నాయక్ మేఘా నిర్మాణ సంస్థ ప్రతి నిధులు అంగర సతీష్‌బాబు, గంగాధర్, మురళి పమ్మి పాల్గొన్నారు.