ఉద్యాన పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం
ABN , Publish Date - Jun 06 , 2026 | 12:05 AM
ఉద్యాన పంటలను విస్తరి ంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రొత్సహి స్తున్నదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్, మే జూన్ 5 (ఆంధ్రజ్యోతి):ఉద్యాన పంటలను విస్తరి ంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రొత్సహి స్తున్నదని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. వెంకట్రా మన్నగూడెంలోని డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యా న విశ్వవిద్యాలయ ఆవరణలో నిర్వహించి న రైతు దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటే దేశం బాగుంటుందనే సంకల్పంతోనే కూటమి రైతులకు మేలు చేసే విధంగా పనిచేస్తుందన్నారు. ఉద్యాన విద్యాలయ ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు మాట్లాడుతూ రైతులను ప్రొత్సహించే విధంగా ఉద్యాన పరిశోధనలు జరుగుతు న్నాయని రాయలసీమలో లక్ష కోట్లతో ఉద్యాన హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణా ళికతో ముందుకు వెళ్తుందన్నారు. శ్రీ వెంక టేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ ఉపకుల పతి డాక్టర్ జేవి రమణ మాట్లాడుతూ పాడి పరిశ్రమకు ప్రభుత్వ ప్రొత్సాహకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆచార్య ఎన్జీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ పాలడుగు సత్యనారా యణ ప్రసంగించారు. ముందుగా వర్శిటి ఆవరణలోని పరిపాలన భవనం, బాలికల వసతి గృహం, ఉద్యాన ప్రదర్శన స్టాల్స్‌ను ప్రారంబించారు. ఉద్యాన పంటల బ్రౌచ ర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఉత్తమ రైతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఏఎంసీ చైర్మన్‌లు యద్దనపూడి బ్రహ్మరాజు, చాపల మంగాబాయ్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, తెలుగు రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి, పలు ప్రాంతాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.