Share News

శిథిలావస్థలో ప్రభుత్వ భవనాలు, వంతెనలు

ABN , Publish Date - Apr 15 , 2026 | 12:55 AM

పట్టణంలో పలు ప్రభుత్వ భవనాలు శిథిలా వస్థకు చేరాయి. వీటిలో ప్రధానంగా 1930లో బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం

 శిథిలావస్థలో ప్రభుత్వ భవనాలు, వంతెనలు
వడలి –మునమర్రు రహదారిలో శిథిలమైన వంతెన

పాలకొల్లు అర్బన్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలో పలు ప్రభుత్వ భవనాలు శిథిలా వస్థకు చేరాయి. వీటిలో ప్రధానంగా 1930లో బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం సుమారు 95ఏళ్ళుకు పైగా అయిన ఈభవనం రాతితో, గానుగ సున్నంతో కట్టారు. పురాతనమైన ఈ భవనానికి 1992లో కొన్ని మరమ్మతులు చేసి, పక్కన రికార్డుల భద్రపరిచే గదిని నిర్మించారు. ఈభవనం నిర్మాణానికి 2012లో సుమారు రూ.30 లక్షలు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదు. పెద్దగా వర్షం వస్తే కార్యాలయం ఆవరణ అంతా వర్షపునీటిలో నిండిపోతుంది. ఇప్పటికైనా నూతన భవన నిర్మాణం చేపట్టాలని కక్షి దారులు, లేఖర్ల సంఘం నాయకులు కోరుతున్నారు. అలాగే లాకుల్లో ఉన్న ఇరిగేషన్‌ భవనాలు, అధికారుల నివాస భవనాలు శిఽథిలావస్థకు చేరాయి. మున్సిపల్‌ కార్యాలయం ముందుభాగంలో పాత కార్యాలయం భవనం శిఽథిలావస్థలో ఉంది. తహసీల్ధార్‌ కార్యాలయం 30ఏళ్ళ కిత్రం నిర్మించారు. ఈభవనం పాడైపోయి, మరమ్మతులు చేయవలసిన పరిస్థితి నెలకొంది.

వంతెనలు...

వాసవి పెనుగొండ, ఏప్రిల్‌ 14 (ఆంధ్ర జ్యోతి): పెనుగొండ మండలంలో పలు గ్రామాల్లో వంతెనలు శిథిలావస్థకు చేరుకు న్నాయి. రక్షణ గోడలు దెబ్బతిని ప్రమాదక రంగా మారాయి. దొంగరావిపాలెంలో వంతెనకు రక్షణ గోడలు లేకపోవడంతో ఎపుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని రైతులు, గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులను బయటకు తరలించేందుకు ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. వడలి –మునమర్రు రహదారిలో వడలి సమీ పంలో వంతెన శిథిలావస్థకు చేరుకుంది. ఈ వంతెన మీదుగా వడలి, మునమర్రు, కొఠాలపర్రు, దేవ తదితర గ్రామాల ప్రజల రాకపోకలు సాగిస్తుంటారు. రక్షణ గోడలు దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. పెనుగొండలోని అడ్డపుంత రహదారిలో పంట కాలువపై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. ఈ వంతెన మీదుగా అడ్డపుంత కాలనీ వాసులు నిత్యం వెళుతుంటారు. రాత్రి సమయంలో పలు ప్రమాదాలకు గురవుతున్నామని కాలనీ వాసులు చెబుతున్నారు. ఇదే వంతెన మీదుగా పంటల ఉత్పత్తులను కూడా తరలిస్తుంటారు. సుమారు వెయ్యు ఎకరాలకు సంబంధించిన పంటల ఉత్పత్తులను ఈ వంతెనమీదుగానే తరలిస్తుంటారు. వంతెన శిఽథిలమవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Updated Date - Apr 15 , 2026 | 12:55 AM