Share News

2న గవర్నర్‌ పోలవరం పర్యటన ఖరారు

ABN , Publish Date - Apr 01 , 2026 | 12:35 AM

రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈ నెల 2న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరా రైంది.

2న గవర్నర్‌ పోలవరం పర్యటన ఖరారు

2న గవర్నర్‌ పోలవరం పర్యటన ఖరారు

ఏలూరు, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈ నెల 2న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ ఖరా రైంది. రెండున మధ్యాహ్నం 12.30 గంటలకు కాకినాడ నుంచి హెలీకాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం ఒంటి గంటకు పోలవరం ప్రా జెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలోని ఇరిగేషన్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటా రు. మధ్యాహ్నం 1.15 గంటల నుంచి 2.30 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకుం టారు. అనంతరం 2.45 గంటలకు పోలవరం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి విజయవాడకు వెళ్తారు.

Updated Date - Apr 01 , 2026 | 12:35 AM