శుభవార్త
ABN , Publish Date - Mar 23 , 2026 | 12:36 AM
రాష్ట్రవ్యాప్తంగా గురుకుల సొసైటీ పాఠశాలు, వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల ఉద్యోగ విరమణ వయస్సు 62కు పెరగనుంది.
కార్పొరేషన్లు, గురుకుల సొసైటీలు ఉద్యోగులకు లబ్ధి
జిల్లాలో సుమారు 300
మందికి మేలు.. వీరిలో బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, సెట్వెల్ సీఈవో ప్రభాకర్‌రావు..!
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
రాష్ట్రవ్యాప్తంగా గురుకుల సొసైటీ పాఠశాలు, వివిధ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, అధికారుల ఉద్యోగ విరమణ వయస్సు 62కు పెరగనుంది. ఈ మేరకు మంత్రులతో కూడిన ఉపసంఘం సానుకూలంగా ఆమోదముద్ర వేసింది. త్వరలో కేబినెట్‌లో ఆమోదముద్ర వేయనున్నారు. జిల్లాలో బీసీ, ఎస్సీ, గృహ నిర్మాణ సంస్థ, విద్యుత్‌శాఖ, మైనార్టీ, గురు కుల సొసైటీలు, ఆశ్రమ సొసైటీలు, ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ, ఫుడ్ కార్పొరేషన్, ఎస్టీ కార్పొ రేషన్, సెట్వెల్, ఆప్కో తదితర 50కు పైగా సొసైటీలు, కార్పొరేషన్ల ఉద్యోగులకు ఊరట లభించనుంది. రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర పడితే జిల్లాలో వివిధ కార్పొరేషన్లలో ఉద్యోగ, సిబ్బంది దాదాపుగా 300 మందికి పైగా ప్రభుత్వ నిర్ణయం ఊరటనిచ్చే అవకాశం ఉంది. వివిధ కార్పొరేషన్లకు వయో పరిమితి పెంచడం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి భారం పడదు. ఈ నేపథ్యంలో రెండేళ్లకు వీరి పదవీ కాలం పెంచడం వల్ల ఖాళీలు ఏర్పడిన పోస్టు ల్లో చాలా వరకు వారే కొనసాగే అవకాశం ఉంది. ఈ విధానం వల్ల సూపరింటెండెంట్, సీనియర్, జూనియర్ అసిసెంట్ల ఉద్యోగ కాలం పెరగనుంది.
ఇద్దరు అధికారులకు ఊరట ..!
జిల్లాలో కేబినెట్ ఆమోదముద్ర పడితే ఇద్దరు అధికారులకు ఊరట లభించనుంది. బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్.పుష్పలత, సెట్వెల్ సీఈవో కోట ప్రభాకర్‌రావు ఈ ఏడాది మే నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఇదిలా ఉండగా కొద్ది నెలలు క్రితమే ఇక్కడ ఉద్యోగ విరమణ చేసిన సెట్వెల్ సీఈవో మెహర్రాజ్‌కు జీవో వస్తే ఉపయుక్తం కానుంది. ఆయన 60 ఏళ్లకు రిటైర్ అయ్యారు. మూడు నెలలు పదవీకాలం లోపు ఉంటే విధుల్లోకి తీసుకోవచ్చని మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈయనకు తిరిగి ఛాన్స్ లభించే అవకాశం ఉంది.
మంత్రుల కమిటీ నిర్ణయం హర్షణీయం
గత ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయ స్సును 60 నుంచి 62కు పెంచే విషయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యో గులకు పెంచకపోవడం వల్ల చాలా ఇబ్బం దులు పడ్డారు. సీఎంను కలిసిన ప్రతి సంద ర్భంలో రిటైర్‌మెంట్ వయస్సును పెంచాలని ప్రతిపాదనలు ఎన్జీవో సంఘం ద్వారా ఇచ్చాం. మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు రిటైర్‌మెంట్ వయస్సును 62 పెంచాలని నిర్ణయించడం హర్షణీయం. వివిధ కార్పొ రేషన్లలో పనిచేసే నాల్గొవ తరగతి ఉద్యో గులు, గురుకులాల్లో పనిచేసు ఉపాధ్యా యులకు లబ్ధి చేకూరుతుంది.
– చోడగిరి శ్రీనివాస్, జిల్లా ఎన్జీవో సంఘం అధ్యక్షుడు