Share News

అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌ న్యూస్‌

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:54 AM

అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం మరింత పటిష్టంగా అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూ అమలు చేయనుంది. ఉమ్మడి జిల్లాలో 1626కు పైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.

అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌ న్యూస్‌

అంగన్‌వాడీ చిన్నారులకు గుడ్‌ న్యూస్‌

మెరుగైన మెనూ అమలుకు ప్రభుత్వ నిర్ణయం

అత్తిలి, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం మరింత పటిష్టంగా అందించేందుకు ప్రభుత్వం కొత్త మెనూ అమలు చేయనుంది. ఉమ్మడి జిల్లాలో 1626కు పైగా అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 0–3 ఏళ్ల లోపు చిన్నారులు 20 వేల మంది, 3–5 ఏళ్ల పిల్లలు 25 వేల మంది ఉంటారు. వీరికి నూతన మెనూను ప్రకటించడంతో చిన్నా రుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొత్త మెనూ ఇలా..

ఫ ఇకపై వారంలో 2 రోజులు ఎగ్‌ ఫ్రైడ్‌ రైస్‌ అందించనున్నారు.

ఫ అదే రోజుల్లో ఉడికించిన శనగలు కూడా ఇస్తారు. పులిహోర బదులు ఈ కొత్త మెనూ అమలు కానుంది.

బాలామృతంలోను మార్పులు..

జూనియర్‌ బాలామృతం 7 నుంచి 12 నెలల పిల్లలకు, సీనియర్‌ బాలా మృతం 13 నెలలు నుంచి 36 నెలల పిల్లలకు అందించేలా నిర్ణయించారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల పట్ల చిన్నారులు ఆకర్షితులవుతారు.

Updated Date - Mar 08 , 2026 | 12:54 AM