సుపరిపాలనే లక్ష్యం
ABN , Publish Date - Apr 04 , 2026 | 01:04 AM
ప్రజల హక్కు లకు భరోసా కల్పిస్తూ సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్య మని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు.
ఆగిరిపల్లి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):ప్రజల హక్కు లకు భరోసా కల్పిస్తూ సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్య మని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు. కలటూరు లో శుక్రవారం మీ భూమి – మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని, రైతు లకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను 453 మంది రైతులకు పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములు రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతుల కు పంపిణీ చేస్తున్నామన్నారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు భూసమస్యలు లేకుండా చేయడం మన ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం అసంబద్ధంగా తెచ్చిన ల్యాండ్ టైటలింగు యాక్డు రద్దుతో రైతులకు, ప్రజలకు అభద్రతను దూరం చేశామన్నారు. రైతుల హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. భూసమస్యలను పారదర్శకంగా, వివాదాలు లేకుండా పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.