Share News

కొబ్బరికి మహర్దశ

ABN , Publish Date - Jan 24 , 2026 | 01:00 AM

పశ్చిమ గోదావరి జిల్లా కొబ్బరి దశకు మహ ర్దశ పట్టనుంది. యలమంచిలి మండలం ఊటాడలో కొబ్బరి ప్రోసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధ మైంది. ఇది పూర్తయితే కొబ్బరి ఉత్తత్పులకు గిరాకీ ఏర్పడుతుంది.

కొబ్బరికి మహర్దశ
చురుగ్గా సాగుతున్న పరిశ్రమ నిర్మాణ పనులు

పనులు ప్రారంభం.. ఏడాదిలో పూర్తి

కొబ్బరి ఉత్పత్తుల తయారీ.. రైతుకు గిట్టుబాటు ధర

ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి.. అనుబంధ పరిశ్రమల ఏర్పాటు

యలమంచిలి/పాలకొల్లు, జనవరి 23(ఆంధ్ర జ్యోతి):పశ్చిమ గోదావరి జిల్లా కొబ్బరి దశకు మహ ర్దశ పట్టనుంది. యలమంచిలి మండలం ఊటాడలో కొబ్బరి ప్రోసెసింగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధ మైంది. ఇది పూర్తయితే కొబ్బరి ఉత్తత్పులకు గిరాకీ ఏర్పడుతుంది. మరింత మందికి ఉపాధి లభిస్తుంది. గత ఏడాదికి ముందు నాలుగేళ్లపాటు కొబ్బరి ధర కనిష్టస్థాయిలో ఉండటంతో రైతులకు పెట్టుబడులు రాని పరిస్థితి. ఈ కారణంగా కొందరు చెట్లను తొల గించి ఆక్వా చెరువులు తవ్వించారు. మరికొందరు లే అవుట్‌లు వేసి స్థలాలుగా అమ్మేశారు. కొన్ని నెలలు గా కొబ్బరి ధర ఆశాజనకంగా ఉన్నప్పటికి మళ్లీ ఇటీ వల తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలోనే గోదా వరి కోకోనట్‌ అసోసియేషన్‌ రూ.29.97 కోట్లతో ప్రొసెసింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీని క్లస్టర్‌ పరిధి 30 కిలోమీటర్లు. దీని నిర్మాణానికి రెండు నెలల క్రితం మూడు ఎకరాల విస్తీర్ణంలో పనులు ప్రారంభించారు. రోజుకు లక్ష కొబ్బరి కాయ లను ప్రోసెసింగ్‌ చేసే సామర్ధ్యంతో నిర్మిస్తున్న ఈ పరిశ్రమ ఈ ఏడాది డిసెంబరుకు పూర్తి చేసి, జనవరిలో ప్రారంభిస్తారు. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి లభిస్తుంది. వీటితోపాటు మరో 25 అనుబంధ పరిశ్రమలు నెలకొల్పే అవకాశం వుంది. ప్రోసెసింగ్‌, ప్యాకేజింగ్‌, రవాణా రంగాల్లో ఎక్కువ సంఖ్యలో ఉపాధి లభిస్తుంది. ఈ పరిశ్రమలో కొబ్బరి నూనె, డెసికేటెడ్‌ కోకోనట్‌ పౌడర్‌, ప్యాకేజ్డ్‌ కోకోనట్‌ వాటర్‌ తదితర ఉత్పత్తులను తయారు చేస్తారు. వీటికి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. వర్జిన్‌ కోకోనట్‌ ఆయిల్‌ను తల్లిపాలతో సమానంగా చూస్తారు. ఇది చర్మ సంరక్షణకు, ఆరోగ్యానికి మంచిది.

మన కొబ్బరికి డిమాండ్‌

ఇక్కడే పుట్టి పెరిగాం. అమెరికా, తదితర విదేశాల్లో కొబ్బరి ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ ఉండటం నేరుగా చూశాం. ఇక్కడి కొబ్బరిలో గుడ్డు ఎక్కువ. ఆయిల్‌ కంటెంట్‌ ఎక్కవే. వచ్చే జనవరి నాటికి కొబ్బరి ప్రొసెసింగ్‌ ఇండస్ర్టీని ప్రారంభిస్తాము.

–ఎస్‌.దిలీప్‌కుమార్‌, ఎండీ, గోదావరి కోకోనట్‌ అసోసియేషన్‌

Updated Date - Jan 24 , 2026 | 01:00 AM