పట్టణాలకు గోదారి జలాలు
ABN , Publish Date - Aug 01 , 2026 | 12:56 AM
పట్టణాలకు విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలు మళ్లించే పైప్‌లైన్ ప్రాజెక్ట్ పరుగులు పెడుతోంది. శరవేగంగా పైప్‌లైన్ పనులు చేప డుతున్నారు.
విజ్జేశ్వరం వద్ద 60 సెంట్లు స్థలం కేటాయింపు ..అక్కడే బావి ఏర్పాటు
అక్కడ నుంచి పైప్‌లైన్ ద్వారా పంపుల చెరువులకు పంపింగ్
తొలి దశలో 36 కి.మీ మేర పనులు..
ఇప్పటికి 24 కి.మీ పూర్తి
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పట్టణాలకు విజ్జేశ్వరం నుంచి గోదావరి జలాలు మళ్లించే పైప్‌లైన్ ప్రాజెక్ట్ పరుగులు పెడుతోంది. శరవేగంగా పైప్‌లైన్ పనులు చేప డుతున్నారు. విజ్జేశ్వరం వద్ద పైప్‌లైన్ ప్రాజెక్ట్ కోసం 60 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అక్కడ బావిని ఏర్పాటు చేస్తారు. అందులోకి గోదావరి జలాలు చేరుకుంటాయి. అక్కడనుంచి పట్టణాల్లోని పంపుల చెరువుకు నేరుగా గోదావరి జిలాలను పంపింగ్ చేస్తారు. దీనివల్ల పంటకాలువలు, డ్రెయిన్ల కాలుష్యం తగ్గిపో నుంది. ప్రస్తుతం జిల్లాలోని పంటకాలువలన్నీ కాలుష్య కారకాలుగా మారాయి. ఇళ్ల నుంచి డ్రెయిన్‌లు నేరుగా కాలువల్లోకి విడచి పెడు తున్నారు. పట్టణాల్లో మురుగునీరు కూడా కాలువల్లోనే కలసిపోతోంది. దీనివల్ల పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందడం లేదు. శుద్ధి ప్లాంట్‌ల నుంచి కొనుగోలు చేసు కుంటున్నారు. జిల్లాలో సుమారు 8 లక్షలు నివాసాలు న్నాయి. అందులో 50 శాతం ఇళ్లల్లో మినరల్ వాటర్ కొనుగోలుపైనే ఆధారపడుతున్నారు. ప్రతిఏటా రూ. 250 కోట్ల మేర తాగునీటి కొనుగోలు కోసం వెచ్చిస్తున్నారు. హోటల్స్, ఇతర ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లలోనూ నీటి శుద్ధి ప్లాంట్‌లలోనే కొనుగోలు చేస్తున్నారు. దీనికి కూడా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. గోదావరి జలాలను నేరుగా పట్టణాలకు మళ్లించడం ద్వారా కాలుష్యం తగ్గిపోనుందని ప్రభుత్వం భావిస్తోంది. అమృత్ పథకంలో నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం రూ.36 కోట్లతో పైప్‌లు కొనుగోలు వేశారు. భీమవరం నుంచి విజ్జేశ్వరం వైపు పైప్‌లైన్ వేస్తున్నారు. రెండేళ్ల వ్యవధిలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని సంక ల్పించారు. జిల్లాలో భీమవరం, తణుకు, పాల కొల్లు, నర్సాపురం, ఆకివీడు పట్టణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
జిల్లాలో 24 కి.మీ పూర్తి
జిల్లాలో అన్ని పట్టణాలకు కలిపి మొత్తం 112 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ వేయాల్సి ఉంది. తొలిదశలో భీమవరం నుంచి విజ్జేశ్వరం వైపు 36 కిలోమీటర్లు పొడవునా పైప్‌లైన్‌లు వేస్తు న్నారు. ఇందులో ఇప్పటికే 24 కి.మీ పూర్తి చేశారు. మరో 40 కి.మీ మేర పనులకు సంబం ధించి పైప్‌ల కోసం ఆర్డర్లు పెట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు పైప్‌లైన్ వేసే భాధ్యతను ఒకే ఏజన్సీకి అప్పగించారు. ఇప్పటికే పైప్‌లైన్‌కు అవసరమైన అన్ని అనుమతులు లభించాయి. గ్రామీణ ప్రాంతాలకు వాటర్ గ్రిడ్ తరహాలో శుద్ధిచేసిన నీరు ఇవ్వాలంటే దాదాపు రూ. 2 వేల కోట్లు అవసరం కానుందని అంచనా వేశారు. మరోవైపు మునిసి పాలిటీల్లో ప్రస్తుతం ఉన్న నీటి శుద్ధి ప్లాంట్‌లు వృధా కానున్నాయి. అందుకోసమే గోదావరి జలాలను నేరుగా పంపుల చెరువులకు మళ్లించనున్నారు. అక్కడే శుద్ధి చేసి ఓవర్‌హెడ్ ట్యాంకులకు పంపిణీ చేస్తారు. అక్కడనుంచి కుళాయిలకు సరఫరా కానుంది. వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా పైప్‌లైన్ ప్రాజెక్ట్ ఉపయుక్తంగా ఉంటుంది. నీటి ఎద్దడికి తావుండదు. భీమవరంలో నీటి శుద్ధి ప్లాంట్‌లు అదనంగా నిర్మించారు. అక్కడ వేసవిలోనూ రెండు పూటలా సమృద్ధిగా మంచినీరు ఇవ్వ డానికి అవకాశం ఉంటుంది. నర్సాపురం, పాలకొల్లు, తణుకు పురపాలక సంఘాల్లో వేసవిలోనూ తాగునీటి కష్టాలు తీరనున్నాయి. అమృత్ 2.0లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ మంజూరు చేసింది. అందులో 30 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం, 20 శాతం నిధులను సంబంధిత మున్సిపాలి టీలు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయించ నుంది. పైప్‌లైన్ ప్రాజెక్టు కోసం జిల్లాకు ప్రత్యే కంగా రూ.501.85 కోట్లు కేటా యించారు. ఆకివీడుకు రూ. 67 కోట్లు, నర్సాపురం రూ.104.76 కోట్లు, భీమవరంరూ. 140.78 కోట్లు, పాలకొల్లు రూ.97.24 కోట్లు, తణుకు రూ.92.07 కోట్లు కేటాయించారు.