Share News

వశిష్ఠ ఉగ్రరూపం

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:11 AM

గోదావరి వరద ఆదివారం మరింత పెరిగింది.

వశిష్ఠ ఉగ్రరూపం
సిద్ధాంతం వద్ద గట్లను తాకుతూ ప్రవహిస్తున్న గోదావరి

దిగువకు వరదనీరు

లంక గ్రామాల్లో అప్రమత్తం

ముంపులోనే కనకాయలంక కాజ్‌వే

పడవల్లోనే రాకపోకలు

కోడేరు వద్ద పరిశీలించిన కలెక్టర్‌

నరసాపురంలో నిలిచిన పంటు ప్రయాణం

వాసవి పెనుగొండ/ఆచంట/యలమంచిలి/ నరసాపురం ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద ఆదివారం మరింత పెరిగింది. ఎగువ నుంచి వరద నీరు వదలడంతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాసవీ పెనుగొండ మండలం సిద్దాంతం దొంగరావిపాలెం, నడిపూడి గ్రామాల పరిధిలో ఏటిగట్టు వెంబడి సాగు చేసిన కూరగాయల పంటలు, అరటి తోటలు నీటిలో మునిగి పోయాయి. లంక భూముల్లో పండించిన కూరగాయలను పడవల ద్వారా ఒడ్డుకు తరలించారు.

కోడేరు వద్ద వరద పరిస్థితిని ఆదివారం కలెకర్‌ నాగరాణి పరిశీలించారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. భద్రా చలం వద్ద వరద తగ్గుతున్న నేపఽథ్యంలో దిగువ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. లంకగ్రామాల్లో తాగునీరు, విద్యుత్‌, వైద్య సేవలతో పాటు ఇతర అత్యవసర ఉండాలని సూచించారు. అయోధ్యలంక, పుచ్చల్లంక, మర్రిమూల, రావిలంక, కోడేరు, పల్లిపాలెం పెదమల్లం, ఆనగారలంక గ్రామాల్లో అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

యలమంచిలి మండలంలోని కనకాయలంక కాజ్‌ వే వరద ముంపులోనే ఉంది. దీంతో లంక వాసులు పడవల్లో రాకపోకలు కొనసాగిస్తు న్నారు. కనకాయలంక గ్రామంలోని సుమారు 850 కుటుంబాల ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లాలంటే కాజ్‌వే వద్ద పడవలపై ప్రయాణించా ల్సిన పరిస్థితి నెలకొంది. మండలం లోని బాడవ, చించినాడ, యలమంచిలి, లక్ష్మీపాలెం, దొడ్డిపట్ల గ్రామాల్లో పుష్కరఘాట్‌లు పూర్తిగా నీటముని గాయి. వరద పరిస్థితిని తహసీల్ధారు జి.పవన్‌ కుమార్‌ ఆదివారం పరిశీలించారు. వరద పరి స్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. బియ్యం, నిత్యావసరాలు అందుబాటులో ఉంచామని, హెల్త్‌ క్యాంపులో అవసరమైన మందులు అందబాటులో ఉన్నాయని తెలిపారు.

నరసాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది ఎగువ నుంచి ఆదివారం సాయం త్రానికి సుమారు మూడున్నర లక్షల క్యూసెక్కుల వరద నీరును సముద్రంలోకి విడిచిపెట్టారు. దీంతో అన్ని రేవుల్లో నీటిమట్టాలు పైవరకు చేరుకున్నాయి. బాపు ఘాట్‌లోకి నీళ్ళు చేరాయి. మూడో రోజు కూడా ఉభయ గోదావరి జిల్లాల మధ్య పడవల రాకపోకల్ని నిలిపివేశారు. నదీ ప్రవాహం పెరుగుతుండటంతో వేటకు అనుమతించడం లేదు.సంప్రదాయ పడవలన్నీ బుడితల రేవు వద్దకు చేరుకున్నాయి. పరిస్ధితిని ఎప్పటికప్పుడు ఆర్డీవో పరిశీలిస్తున్నారు.గట్ల పరిస్ధితిని ఏటిగట్టు శాఖ అధికారులు, లస్కర్లు పరిశీలి స్తున్నారు. బలహీనంగా ఉన్న గట్ల వద్ద ఇసుక బస్తాలు వేస్తున్నారు.

Updated Date - Aug 03 , 2026 | 12:11 AM