Share News

ప్రాణాలకేదీ భద్రత..?

ABN , Publish Date - Jun 13 , 2026 | 12:36 AM

రుద్రమ్మకోట– కూనవరం మధ్య పడవరేవు నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. నిబంధనలకు విరుద్ధం గా చేపలు తరలించే పడవులపై ప్రయాణికులను తరలిస్తున్నారు.

ప్రాణాలకేదీ భద్రత..?
పరిమితికి మించి పడవలో ప్రయాణికుల తరలింపు

ఇష్టారాజ్యంగా రుద్రమ్మకోట– కూనవరం పడవరేవు నిర్వహణ

నిబంధనలకు తిలోదకాలు

చేపలు వేటాడే పడవులపై ప్రయాణికుల తరలింపు.. పట్టించుకోని అధికారులు

వేలేరుపాడు, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి):రుద్రమ్మకోట– కూనవరం మధ్య పడవరేవు నిర్వహణ ఇష్టారాజ్యంగా మారింది. నిబంధనలకు విరుద్ధం గా చేపలు తరలించే పడవులపై ప్రయాణికులను తరలిస్తున్నారు. మూడు రాష్ర్టాల ప్రజలకు రాక పోకలకు ఏకైక మార్గం గోదావరిపై పడవ ప్రయా ణమే. వేలేరుపాడు మండలంతో పాటు బయట ప్రాంతాల వారు, పోలవరం జిల్లాలోని ప్రజలు చత్తీస్‌గడ్‌, ఒడిశా రాష్ర్టాలకు చెందిన వారు నిత్యం ఈ మార్గంలోనే వందల సంఖ్యలో ప్రయా ణాలు సాగిస్తుంటారు. పోలవరం జిల్లా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు భద్రాచలం మీదుగా వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్లు తిరిగి రావాలి. అదే గోదావరిని దాటితే కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే కూనవరం ఉంటుంది. అక్కడ నుంచి బస్సులు, ఇతర వాహనాల ద్వారా తమ గమ్యస్థానాలు వెళ్లేందుకు దూరాభారం తగ్గడమే కాకుండా ఖర్చు కలిసి వస్తుంది. అయితే ఈ పడవరేవు నుంచి రాకపోకలు ప్రమా దపు అంచుల్లో జరుగుతున్నా అధికారులు పట్ట నట్టు వ్యవహరిస్తున్నారు. ఏటా రుద్రమ్మకోట– కూనవరం మధ్య గోదావరిపై ప్రయాణికులను దాటించేందుకు రేవు వేలం పాట నిర్వహిస్తారు. ఈ ఏడాది రూ.80 లక్షలకు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి నట్టు పలువురు ఆరోపిస్తున్నారు.

లాంచీకి బదులు చేపల పడవ

ప్రయాణికులను తరలించేందుకు లాంచీని ఏర్పాటు చేయాల్సి ఉం డగా ఖర్చు ఎక్కువ అవుతుందని తద్వారా తనకు లాభాలు తగ్గిపోతాయని చేపలు వేటాడే పడవల ద్వారా పరిమితికి మించి ప్రయాణికులను తరలి స్తున్నా రు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో జనం రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికులతో పాటు ద్విచక్రవాహనాలను అదే పడవ లో ఎక్కించి దాటిస్తున్నారు. నిబంధనల ప్రకారం పడవ లో ప్రయాణించే వారితో పాటు పడవ నడిపేవారు లైఫ్‌ జాకెట్లు ధరించాలి. అది ఖర్చుతో కూడుకున్న పని కావ డంతో లైఫ్‌ జాకెట్లను అందుబాటులో ఉంచకుండా ప్రయాణికుల ప్రయాణాలతో చెల గాటం ఆడుతున్నారు. పడవ రేవు నిబంధనల ప్రకారం ఒక్కొ ప్రయాణికుడి నుంచి రూ.50, ద్విచక్ర వాహనానికి రూ.50 చొప్పున వసూలు చేయాల్సి ఉండగా ద్విచక్ర వాహనానికి రూ.100–200 వరకు వసూలు చేస్తున్నారని ప్రయా ణికులు వాపోతున్నారు. రేవులో జరుగుతున్న అక్ర మాలపై చర్యలు తీసుకోవాలంటూ కొక్కిరిపాటి రవీంద్ర అనే సామాజిక కార్యకర్త తహసీల్దార్‌కు, ఎంపీడీవోకు రుద్రమ్మ కోట, కూనవరం పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.

Updated Date - Jun 13 , 2026 | 12:36 AM