Share News

శాంతించిన గోదావరి

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:31 AM

విలీన మండలాల ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేసిన గోదావరి వరద చివరికి శాంతించి తగ్గుముఖం పట్ట డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

శాంతించిన గోదావరి
వేలేరుపాడు–రేపాకగొమ్ము రహదారి పైనే గోదావరి వరద

వేలేరుపాడు, కుక్కునూరుల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు

ముంపులోనే పంట పొలాలు

పోలవరం వద్ద వరద ఉధృతి

వేలేరుపాడు/కుక్కునూరు/పోలవరం ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): విలీన మండలాల ప్రజలకు కంటి మీద కునుకులేకుండా చేసిన గోదావరి వరద చివరికి శాంతించి తగ్గుముఖం పట్ట డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తెలం గాణలోని భద్రాచలం వద్ద ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు నీటిమట్టం 41 అడుగులకు చేరుకోగా మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించారు. వేలేరుపాడు, కుక్కునూరు మండ లాల్లో వరద స్వల్పంగా తగ్గింది. సోమవారం ఉదయానికి నీటమునిగిన రహదారులు బయటపడే అవకాశం ఉంది. వరద పూర్తిస్థాయిలో తగే ్గందుకు మరో రెండు రోజులు పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కోయిదా వైపు వెళ్లే 33కేవీ విద్యుత్‌లైన్‌ వరదలో మునిగిపోవడంతో విద్యుత్‌ను నిలిపివేశారు. ఆదివారం విద్యుత్‌ సిబ్బం ది పడవల ద్వారా విద్యుత్‌వైర్లకు చిక్కుకున్న చెట ్లకొమ్మలు, చెత్తా చెదారం తొలగించి తెగి పోయిన వైర్లు సరిచేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. కుక్కునూరు గ్రామ శివారులోని గుండేటివాగు ప్రాంతంలో జామాయిల్‌ వేసిన పంట పొలాలు వరద నీటిలోనే ఉన్నాయి. మండలంలో అధికారులు పారిశుధ్యంపై దృష్టి పెట్టారు. విషజ్వరాలు, అంటువ్యాధులు, వ్యాప్తి చెందకుండా గ్రామాల్లో బ్లీచింగ్‌ చల్లిస్తున్నారు. దాచారం పునరా వాస కాలనీకి తరలివచ్చిన గొమ్ముగూడెం నిర్వాసి తులకు మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగు తోంది. పట్టిసీమ శివక్షేత్రం ఫెర్రీ రేవు మెట్లు పూర్తిగా నీటమునిగాయి. కడె మ్మ స్లూయిజ్‌ గేట్లను వరద జలాలు ముంచెత్తా యి. ఏటిగట్టుకి కుడివైపున ఉన్న పంటపొలాల్లోకి వరద జలాలు ప్రవేశిస్తున్నాయి. పట్టిసీమ వద్ద సచివాలయ భవనం వద్ద వరద జలాల తాకిడికి ఫెర్రీ గట్టు కోతకు గురై భవనం ప్రమాదకర స్థితికి చేరుకుంది. పురు షోత్తపట్నం, రేవు లాంచీలు, మత్స్యకారుల పడవలను ఏపీ టూరిజం బోట్‌ పాయింట్‌ వద్ద సురక్షిత ప్రాంతాలకు తరలిం చారు. పోలవరం ప్రాజెక్టుకి రాకపోకలు సాగిం చే ప్రధాన రోడ్డుమార్గంలో వంతెనను వరద జలాలు తాకుతూ ప్రవహిస్తున్నాయి. గోదావరి నీటిమట్టం మరింత పెరిగితే ప్రాజెక్టుకి రాకపోకలు బంద్‌ అయ్యే అవకాశాలున్నాయి.

లంక గ్రామాల్లో అప్రమత్తం

వాసవి పెనుగొండ/ఆచంట/యలమంచిలి/ నరసాపురం ఆగస్టు 2(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి వరద ఆదివారం మరింత పెరిగింది. ఎగువ నుంచి వరద నీరు వదలడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాస వీ పెనుగొండ మండలం సిద్దాంతం దొంగరావి పాలెం, నడిపూడి గ్రామాల పరిధిలో ఏటిగట్టు వెంబడి సాగు చేసిన కూరగాయల పంటలు, అరటి తోటలు నీటిలో మునిగి పోయాయి. కోడేరు వద్ద వరద పరిస్థితిని ఆదివారం కలెకర్‌ నాగరాణి పరిశీలించారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయోధ్యలంక, పుచ్చల్లంక, మర్రిమూల, రావిలంక, కోడేరు, పల్లిపాలెం పెదమల్లం, ఆన గారలంక గ్రామాల్లో అధికారులు క్షేత్రస్థాయి లో పరిశీలించారు. యలమంచిలి మండలం లోని కనకాయలంక కాజ్‌వే వరద ముంపులోనే ఉంది. దీంతో లంక వాసులు పడవల్లో రాక పోకలు కొనసాగిస్తున్నారు. నరసాపురం వద్ద వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బాపు ఘాట్‌లోకి నీళ్ళు చేరాయి. మూడో రోజు కూడా ఉభయ గోదావరి జిల్లాల మధ్య పడవల రాకపోకల్ని నిలిపివేశారు.

Updated Date - Aug 03 , 2026 | 12:31 AM