Share News

పెరుగుతున్న గోదావరి

ABN , Publish Date - Sep 27 , 2026 | 12:48 AM

గోదావరి వరద క్రమేణ పెరు గుతోంది. తెలంగాణలోని భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 25 అడు గులు ఉన్న నీటిమట్టం రాత్రి ఎనిమిది గంటలకు 31 అడుగులకు చేరగా ఆదివారం ఉదయానికి 38 అడుగులకు చేరే అవకాశం ఉంది.

పెరుగుతున్న గోదావరి
గోదావరి వరదకు నీటమునిగిన గుండేటివాగు లోలెవల్‌ బ్రిడ్జి

నీట మునిగిన గుండేటివాగు లోలెవల్‌ బ్రిడ్జి

కుక్కునూరు– దాచారం మధ్య నిలిచిన రాకపోకలు

కుక్కునూరు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): గోదావరి వరద క్రమేణ పెరు గుతోంది. తెలంగాణలోని భద్రాచలం వద్ద శనివారం సాయంత్రం 25 అడు గులు ఉన్న నీటిమట్టం రాత్రి ఎనిమిది గంటలకు 31 అడుగులకు చేరగా ఆదివారం ఉదయానికి 38 అడుగులకు చేరే అవకాశం ఉంది. నీటిమట్టం 40 అడుగులకు చేరితే శబరి నది ఎగపోటుతో కుక్కునూరు, వేలేరుపాడు మండ లాల్లో వందలాది ఎకరాల్లో మిర్చి పంటలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గోదావరి వరద ప్రభావంతో కుక్కునూరు–దాచారం గ్రామాల మధ్య గుండేటివాగు లోలెవల్‌ బ్రిడ్జి శనివారం నీటమునగడంతో కుక్కునూరు– దాచారం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నల్లకుంట మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.

వాడిపోతున్న మిర్చి తోటలు

ఇటీవల కురిసిన భారీ వర్షాలు మిర్చితోటలపై తీవ్ర ప్రభావం చూపాయి. తోటల్లో నీళ్లు నిలవడంతో మిర్చి మొక్కలు క్రమేపి వాడిపోతూ కుళ్లిపోతున్నాయి. ఈ ఏడాది కుక్కు నూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 10 వేల ఎకరాల్లో మిర్చి సాగ వుతోంది. దాచారం, గొమ్ముగూడెం ప్రాంతాల్లో మిర్చి తోటలు పూత, కాయదశలో ఉన్నాయి. భారీ వర్షాలకు మిర్చి మొక్కలు పడిపోతు న్నాయి. లేతమొక్కలు కుళ్లిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేలు ఖర్చు అయిందని, కుళ్లిన మొక్కల స్థానంలో మళ్లీ మొక్కలు వేయాల్సిన రావడంతో పెట్టుబడులు పెరిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Sep 27 , 2026 | 12:48 AM