జ్వరంతో గిరిజన బాలిక మృతి
ABN , Publish Date - May 07 , 2026 | 12:39 AM
మండలంలోని కోర్సావారిగూడేంకు చెందిన గిరిజన బాలిక కారం సంగీత (8) జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది.
నాలుగు రోజులు చికిత్స అందించిన ఆర్‌ఎంపీపై డిప్యూటీ డీఎంహెచ్‌వో విచారణ
బుట్టాయగూడెం, మే 6(ఆంధ్రజ్యోతి): మండలంలోని కోర్సావారిగూడేంకు చెందిన గిరిజన బాలిక కారం సంగీత (8) జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. డిప్యూటీ డీఎంహెచ్‌వో జె.సురేష్‌కుమార్ తెలిపిన వివరాలివి. కారం వెంకటేష్, పుష్ప దంపతుల కుమార్తె సంగీత గురుగుమిల్లి ఎంపీపీ పాఠశాలలో 3వ తరగతి చదువుతోంది. ఆమె జ్వరం బారినపడడంతో ఏప్రిల్ 30న దొరమామిడి ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రానికి తీసు కెళ్లగా వైద్యులు రక్తపరీక్షలు చేసి సాధారణ జ్వరంగా గుర్తించి మందులు ఇచ్చి ఇంటికి పంపారు. జ్వరం తగ్గకపోవడంతో తల్లిదండ్రులు గ్రామంలోని ఆర్‌ఎంపీకి చూపించగా మే 1 నుంచి 4 తేదీ వరకు అనుమతిలేని తన ప్రాఽథమిక వైద్య కేంద్రంలో బాలికకు వైద్యం అందిం చాడు. పరిస్థితి విషమించడంతో వేరే ఆసుపత్రికి వెళ్లా లని సూచించడంతో తల్లిదండ్రులు మంగళవారం జంగా రెడ్డిగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు చెప్పడంతో రాజ మహేంద్రవరం బయలుదేరారు. మార్గమధ్యలో కొయ్యలగూడెం వద్ద బాలిక మరణించడంతో ఇంటికి తీసుకొచ్చి మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేశారు. గ్రామస్తుల ద్వారా విషయం తెలియడంతో బుధవారం డిప్యూటీ డీఎంహెచ్‌వో, అంతర్వేదిగూడెం వైద్యాధికారి సౌమ్య, నరేష్ సిబ్బంది గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. గ్రామంలో ఆర్‌ఎంపీ అనుమతిలేని ఆసుపత్రిని నడుపుతున్న విషయాన్ని గుర్తించారు దొరమామిడిలో అనుమతి లేకుండా నడుపుతున్న ప్రైవేటు ల్యాబ్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలిం చారు. నివేదికను కలెక్టర్, డీఎంహెచ్‌వోలకు అందించ నున్నట్టు డిప్యూటీ డీఎంహెచ్‌వో తెలిపారు.