Share News

అనారోగ్యంతో గిరిజన బాలిక మృతి

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:46 AM

నా బిడ్డ మరణానికి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. ప్రాణాలతో తీసుకొచ్చిన బిడ్డను శవంగా ఇంటికి పంపారు’ అంటూ కొండరెడ్డి మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వైద్యులను నిలదీసిన ఘటన బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది.

అనారోగ్యంతో గిరిజన బాలిక మృతి
రికిత్వ

వైద్యుల నిర్లక్ష్యమే కారణమని తల్లిదండ్రుల ఆరోపణ

బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఘటన

బుట్టాయగూడెం, జులై 6(ఆంధ్రజ్యోతి):‘నా బిడ్డ మరణానికి ముమ్మాటికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. ప్రాణాలతో తీసుకొచ్చిన బిడ్డను శవంగా ఇంటికి పంపారు’ అంటూ కొండరెడ్డి మహిళ కన్నీరుమున్నీరుగా విలపిస్తూ వైద్యులను నిలదీసిన ఘటన బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద సోమవారం చోటు చేసుకుంది. బాధిత బంధువులు తెలిపిన సమాచారం మేరకు.. కోర్సవారిగూడెం పంచాయతీ మోతుగూడెంకు చెందిన గోగుల వెంకటరెడ్డి, సునీత దంపతులకు ముగ్గురు సంతానం. కుమారుడు రికిత్‌బాబు(11) అంతర్వేదిగూడెం ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి, పెద్ద కుమార్తె రికిత(9) మోతుగూడెం పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నారు. రెండో కుమార్తె రికిత్వ(4) జ్వరం, వాంతులు, విరేచనాలతో అనారోగ్యానికి గురికావడంతో శనివారం సాయంత్రం తల్లిదండ్రులు బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి సిరప్‌ ఇచ్చి నయం అవుతుందని చెప్పి ఆస్పత్రిలోనే ఉంచారు. ఆదివారం ఆసుపత్రిలో ఉంచిన వైద్యులు 28 గంటలు కావస్తున్నా పాపకు ఎలాంటి రక్త పరీక్షలు చేయలేదు. ఈ విష యమై వైద్య సిబ్బందిని అడగ్గా ఆదివారం సెలవు కావడంతో ఎల్‌టీలు రాలేదని సోమవారం పరీక్షలు చేస్తామని చెప్పారు. 24 గంటలు ఆసుపత్రిలో ఇద్దరు ఎల్‌టీలు పనిచేయాల్సి వుండగా ఇద్దరూ సెలవు ఎలా పెట్టారో అధి కారులు తేల్చాలి. ఆదివారం రాత్రి రికిత్వ తీవ్ర కడుపునొప్పితో బాధ పడడంతో సిబ్బందికి చెప్పితే నీరసంగా ఉంది కదా అలానే వస్తుంది లేనని తేలిగ్గా తీసిపారేశారు. పాప పరిస్థితి విషమించడంతో సోమవారం తెల్లవారుజామున జంగారెడ్డిగూడెం ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లాలని కంగా రుపెట్టి 108లో ఎక్కించారు. అంబు లెన్స్‌ ఆసుపత్రి గేటు దాటకుండానే రికిత్వ మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. పాపను ఇంటికి తీసుకెళ్లి అంత్య క్రియలు పూర్తిచేశారు. సకాలంలో రక్త పరీక్షలు చేసి వైద్యం అందించి వుంటే తమ బిడ్డ ప్రాణా లతో ఉండేదని కన్నీరు పర్యంతమవుతున్నారు. దీనిపై కలెక్టర్‌ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ డిప్యూటీ డీఎంహెచ్‌వో, అంతర్వేదిగూడెం పీహెచ్‌సీ వైద్యుడు డాక్టరు సురేష్‌ కుమార్‌ ఆసుపత్రికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నిర్లక్ష్యంగా వ్యవ హరించిన వైద్యులు, సిబ్బందిపై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపా రు. ఆదివాసీ గిరిజన సంఘం, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, పీడీఎస్‌ యూ, ప్రజా సంఘాల నాయకులు తెల్లం రామకృష్ణ, కారం రాఘవ, బిన్నె వినోద్‌, న్యాయవాది బాషా శ్యాంబాబు వైద్యులతో పాప మృతిపై మాట్లాడి వివరాలు తెలుసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.

ఈ ఘటనపై డ్యూటీ డాక్టర్‌ ప్రశాంత్‌ వివరణ ఇస్తూ.. ‘శనివారం రాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చిన పాపను పరీక్షించి సిరప్‌, ఇంజ క్షన్‌ ఇవ్వమని వైద్య సిబ్బందికి చెప్పాను. ఆదివారం రక్త పరీక్షలు చేయ డానికి ఎల్‌టీ లకు ఫోన్‌ చేశాం. సెలవు కావడంతో ఇద్దరూ స్పందించలేదు. పాపను ఇక్కడకు తీసుకొచ్చేసరికే మూడు రోజులు ఆర్‌ఎంపీ వద్ద వైద్యం చేయించి నట్టు తల్లి తెలిపింది. రక్త పరీక్షలు జరపకపోవడం వల్ల ఏ కారణం వల్ల పాప మృతి చెందిందో చెప్పలే’మన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 12:46 AM