Share News

అల్లం కిలో రూ.250

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:38 AM

మార్కెట్లో అల్లం ధరలు మండుతున్నాయి. గత వారం కిలో రూ.200 ఉన్న అల్లం ఇప్పుడు ఏకంగా రూ.250కు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త అల్లం రావడం లేదు. పాత అల్లంనే విక్రయిస్తున్నారు.

అల్లం కిలో రూ.250

దిగిరానంటున్న చికెన్‌..

అదే బాటలో ఉల్లి

దిగివస్తున్న కూరగాయలు

తాడేపల్లిగూడెం. జూలై 5(ఆంధ్రజ్యోతి):మార్కెట్లో అల్లం ధరలు మండుతున్నాయి. గత వారం కిలో రూ.200 ఉన్న అల్లం ఇప్పుడు ఏకంగా రూ.250కు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త అల్లం రావడం లేదు. పాత అల్లంనే విక్రయిస్తున్నారు. బెంగళూరు, అరకు ప్రాంతాల్లో అల్లం నిల్వలు లేవు. కోల్డ్‌స్టోరేజ్‌లో పెట్టిన పాత అల్లంనే ఇప్పుడు వ్యాపారులు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. జూలై నెలాఖరుకు కొత్త అల్లం మార్కెట్‌కు వస్తుంది. అప్పటి నుంచి వీటి ధరలు తగ్గవచ్చని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్‌కు బెంగళూరు పరిసర ప్రాంతాల నుంచి అరకు ప్రాంతాల నుంచి మేలు రకమైన అల్లం వస్తుంది. ఇది మంచి నాణ్యతాగా ఉంటుంది. దీన్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఇష్టపడతారు. వినియోగదారులు కూడా ఇలాంటి అల్లం కొనుగోలు చేయడానికి ముందుకు రావడంతో ఈ రకం అల్లమే ప్రస్తుత మార్కెట్లో ఉంది.

దిగిరాని ఉల్లి

మార్కెట్లో ఉల్లి ధరలు దిగిరావడం లేదు. హోల్‌సే ల్‌గా క్వింటా ఉల్లి నాణ్యత ఆధారంగా రూ.1300 నుంచి 2800 వరకు విక్రయిస్తున్నారు. వీటిని రిటైల్డ్‌ వ్యాపా రులు నాణ్యమైన ఉల్లిని కిలో రూ.35 మధ్య విక్రయిస్తు న్నారు. రెండవ రకం ఉల్లిని రూ.25 నుంచి 30 మధ్య విక్రయిస్తున్నారు. నాణ్యత లేని ఉల్లిని ఆదివారం మా ర్కెట్లో కిలో రూ.20 నుంచి 25 మధ్య అమ్ముతున్నారు. కొత్త ఉల్లి వచ్చే వరకు ఉల్లి ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు తెగేసి చెబుతున్నారు. మార్కెట్‌కు ఇప్పుడు మహారాష్ట్ర నుంచే ఉల్లి వస్తుంది. సాధార ణంగా మామిడి సీజన్‌ సమయంలో ఉల్లి ధరలు తక్కువగా ఉండేవి. మామిడి సీజన్‌ ముగింపు దశకు చేరింది. ఉల్లిలోడు తీసుకొచ్చిన మహారాష్ట్ర లారీ యజమానులు తిరుగు కిరాయిలో మామిడి పండ్లను ఇక్కడ నుంచి తీసుకెళ్లేవారు. కాని ఇప్పుడు సీజన్‌ లేదు. డీజిల్‌ ధరలు పెరిగిపోవడంతో రానుపోను కిరాయి వేయడంతో ఉల్లి ధరలు పెరగడానికి ఒక కార ణంగా వ్యాపారులు చెబుతున్నారు. కొత్త ఉల్లి వచ్చే వరకు ఉల్లి ధరలు ఇలాగే ఉంటాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర నుంచి 6 లారీల్లో 195 టన్నుల ఉల్లి తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వచ్చింది.

దిగని చికెన్‌

చికెన్‌ ధరలు తగ్గడం లేదు. మార్కెట్లో చికెన్‌ స్కిన్‌ లెస్‌ కిలో రూ.300కు. విత్‌స్కిన్‌ ధర కిలో రూ.280, బర్డ్‌ కిలో రూ.175కు విక్రయించారు. రైతుల వద్ద కోళ్లు లేవు. దీంతో ఇక కార్పొరేట్‌ సంస్థలు కోళ్లను మార్కెట్‌కు తీసుకొస్తున్నారు. మార్కెట్‌లో ధరలను శాసించేది కా ర్పొరేట్‌ సంస్థలు కావడంతో చికెన్‌ ధరలకు రెక్కలొ చ్చాయి. ఇప్పుడు రైతులు కోళ్లను పెంచడం ప్రారం భించారు. ఇవి మార్కెట్‌కు రావాలంటే నెలరోజులు పడుతుంది. అప్పటి వరకు వీటి ధరలు దిగరాక పోవ చ్చని రిటైల్‌ వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా చికెన్‌ వినియోగం ఒక్క ఆదివారమే 35 టన్నులుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మటన్‌ 8 నుంచి 10 టన్నులు వినియోగం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇతర రోజుల్లో చికెన్‌ రోజుకు 25 టన్నులు వరకు వినియోగం జరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. ఇతర రోజుల్లో మటన్‌ సగటున 5 నుంచి 6 టన్నుల వరకు వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చికెన్‌ వినియోగం అధికంగా ఉంది. మటన్‌ కిలో రూ.1000 నుంచి రూ.1200కు విక్రయిస్తున్నారు.

దిగివస్తున్న కూరగాయలు

మార్కెట్లో కూరగాయల ధ రలు దిగివస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణం కొద్దిగా అనుకూలించడంతో మార్కెట్‌కు కూరగాయలు వస్తున్నాయి. రైతులు కూరగాయల తోటలు పెట్టడం అవి దిగుబడికి రావ డంతో మార్కెట్‌కు తెస్తున్నారు. దీంతో కూరగా యలు చాలావరకు సామాన్యులకు అందుబాటు లోకి వచ్చాయి. గత వారంతో పోల్చుకుంటే కిలోకు రూ.5 నుంచి 10 వరకు తగ్గాయి. తెల్ల, నల్ల వం కాయలు కిలో రూ.60, బెండ రూ.30, బీర రూ.50, టమాటా రూ.30, దొండ రూ.30, క్యారెట్‌ రూ.50, బీట్రూట్‌ రూ.50. కాప్సికం రూ.100, బీన్‌ రూ.120. చికుళ్లు రూ.80, కాకరకాయలు రూ.60, మిర్చి రూ.50, అరటి జత రూ.10 నుంచి 20, మునగ జత రూ.10 నుంచి 15కు అమ్మకాలు జరిగాయి.

Updated Date - Jul 06 , 2026 | 12:38 AM