Share News

ఎమ్మెల్యే పత్సమట్ల సంక్రాంతి కానుక

ABN , Publish Date - Jan 11 , 2026 | 11:52 PM

సం క్రాంతి పండుగ సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తన స్వగ్రామ మైన ఫత్తేపురం (చిననిండ్రకొలను) లో పండుగ పిండివంటలు, నాన్‌–వెజ్‌ పచ్చళ్లు తయారు చేయిస్తున్నారు.

ఎమ్మెల్యే పత్సమట్ల సంక్రాంతి కానుక
గిఫ్ట్‌ప్యాక్‌ను ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్నికి అందిస్తున్న ఎమ్మెల్యే ధర్మరాజు

పిండి వంటలు, పచ్చళ్లతో గిఫ్ట్‌ ప్యాక్‌లు.. ప్రజా ప్రతినిధులు, అధికారులకు పంపిణీకి చర్యలు

నిడమర్రు జనవరి 11(ఆంధ్రజ్యోతి): సం క్రాంతి పండుగ సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు తన స్వగ్రామ మైన ఫత్తేపురం (చిననిండ్రకొలను) లో పండుగ పిండివంటలు, నాన్‌–వెజ్‌ పచ్చళ్లు తయారు చేయిస్తున్నారు. గోదావరి జిల్లాల సాంప్రదాయ వంటకాలను, నాన్‌వెజ్‌ పచ్చళ్లు రుచిని అందరికీ అందించడం కోసం గత పది రోజుల నుంచి పిండివంటలు, పచ్చళ్లు తయారీని ప్రారంభించారు.

పిండి వంటల్లో పూతరేకులు, అరిసెలు, గోరుమిటీలు, కజ్జికాయలు, జంతికలు , గవ్వ లుతో కలసి ఒక్కొక్కటి పావు కిలో చొప్పున బాక్స్‌లలో ప్యాక్‌ చేస్తున్నారు. దీనితో పాటు నాన్‌ వెజ్‌ పచ్చళ్లు నాలుగు రకాలు కూడా తయారు చేస్తున్నారు. నాన్‌వెజ్‌ పచ్చళ్లులో రొయ్యపచ్చడి, కొరమేను పచ్చడి, చికెన్‌ పచ్చ డి, మిక్సిడ్‌ వెజ్‌టబుల్‌ పచ్చడి కూడా ఒక్కో రకం పావు కేజీ చొప్పున ప్యాక్‌ చేయిస్తు న్నారు. వీటిని జూట్‌ బ్యాగ్‌లు, గాజు సీసా లతో కూడిన గిఫ్ట్‌ ప్యాకింగ్‌ సంచుల్లో పంపి ణీ చేస్తున్నారు.

వెయ్యి మంది కోసం తయారీ

పిండి వంటలు, నాన్‌ వెజ్‌ పచ్చళ్ల ప్యాకిం గ్‌లను సుమారు వెయ్యి మంది ముఖ్యులు, అధికారులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తు న్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలోని ఎమ్మె ల్యేలతో పాటు అమరావతిలో ఉన్నతాధికారు లకు, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులకు పంపిణీ చేస్తున్నట్లు తెలిసింది. 50 మంది పనివాళ్ళతో 10 రోజులుగా శ్రమకోర్చి ఈ పిం డి వంటలు, పచ్చళ్లు తయారు చేయడం గొప్ప విషయం.

అధికారుల కష్టాన్ని

గౌరవించి కానుకలు

ప్రజా సంక్షేమ పఽథకాల అమలులో కూట మి ప్రభుత్వం తరుపున అనునిత్యం ప్రజా ప్రతినిధులు, ఉన్నతా ధికారులు, ఉద్యోగులు ఎంతో శ్రమతో కృషి చేస్తున్నారు. వారి బా ధ్యతను, నిబద్ధతను, కష్టాన్ని గౌరవించాలనే ఉద్దేశంతో సంక్రాంతి కానుకలు పంపీణీ చేయాలని నిర్ణయించినట్టు ఎమ్మెల్యే ధర్మ రాజు తెలిపారు.

Updated Date - Jan 11 , 2026 | 11:52 PM